Begin typing your search above and press return to search.

అదా రిప్లయ్ అదిరిందిగా..

By:  Tupaki Desk   |   3 July 2018 4:29 AM GMT
అదా రిప్లయ్ అదిరిందిగా..
X
చూడటానికి క్యూట్ గా.. అమాయకంగా కనిపిస్తూ.. పక్కింటమ్మాయిలా కనిపించే లుక్ అదాశర్మది. తన క్యూట్ నెస్ తో టాలీవుడ్ లో కనిపించిన మొదటి సినిమాతోనే ప్రేక్షకులందరికీ హార్ట్ అటాక్ తెప్పించేసింది. ఆ తరవాత రెండు... మూడు సినిమాలు చేసినా పద్ధతైన అమ్మాయిగానే కనిపించింది.

కానీ అదా వెండితెరపై కనిపిపించిన క్యూట్ ఏమీ కాదు. ఈమధ్య హాట్ హాట్ ఫోజులతో నెటిజన్లను బాగానే వేడెక్కించేస్తోంది. తాజాగా నడుము ఒంపులన్నీ చూపిస్తూ వయ్యారంగా నుంచుని ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానుల కళ్లకు పండగ చేసింది. తన హాట్ ఫోజులతో హీటెక్కించడం అదాకు మూమూలే అయినా ఈ ఫోజు మాత్రం చాలాచాలా సెక్సీగా ఉంది. ఈ ఫొటోలు చూశాక ఆమె బ్యూటీని పొగడ్తలతో ముంచెత్తిన వారు కొందరైతే ఇంకొందరు ఆమెపై తిట్ల దండకం అందుకున్నారు.

అదా కనిపించిన తీరుపై ఓ నెటిజన్ అయితే కాస్త నోరు పారేసుకున్నాడు కూడా. ‘ఈ సాలీ (కాస్త వల్గర్ గా వాడే బూతు) కి ఏమి కావాలంటూ కామెంట్ పెట్టాడు. మామూలుగా ఇంత పెద్ద తిట్టుకు మిగతావాళ్లు చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యే వాళ్లే. కానీ అదా మాత్రం ఈ విషయంలో చాలా స్పెసల్. అసలు ఎవరూ ఊహించిన రిప్లయ్ ఇచ్చింది. ‘‘బావగారూ.. ప్లాస్టిక్ బ్యాగులు వాడొద్దు. వెజిటేరియన్ గా మారండి. నీళ్లు వేస్ట్ చేయకండి’’ అంటూ పర్యావరణ పరిరక్షణకు పనికొచ్చే నాలుగు మంచి మాటలు చెప్పింది. అదా తీరు నెటిజన్లకు భలే నచ్చేేసింది.