Begin typing your search above and press return to search.

వామ్మో అదా.. వాటే డ్యాన్స్ బేబీ

By:  Tupaki Desk   |   24 Dec 2015 5:46 AM GMT
వామ్మో అదా.. వాటే డ్యాన్స్ బేబీ
X
1920 అనే హార‌ర్ సినిమాతో బాలీవుడ్‌ కి ప‌రిచ‌య‌మైంది అదాశ‌ర్మ‌. క్యూట్ లుక్స్‌ తో హాట్ అప్పియ‌రెన్స్‌ తో క‌నిపించినా దెయ్యం ప‌ట్టిన అమ్మాయిగా అభిన‌యించాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైంది. అయితే ఈ మూవీలో అదాశ‌ర్మ‌లోని డ్యాన్సింగ్ కోణాన్ని ఆవిష్క‌రించేంత స్కోప్ లేదు. అందువ‌ల్ల అక్క‌డ కూడా కాస్తంత అసంతృప్తికి లోనైంది. అలాగే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రంలో ఆడిపాడింది. కానీ ఆ మూవీలో త‌న పాత్ర ప‌రిధి అంతంత మాత్ర‌మే.

కాబ‌ట్టి అప్పుడు కూడా డ్యాన్సుల‌తో హోరెత్తించేసే ఛాన్సే రాలేదు. అయితే ఎట్ట‌కేల‌కు ఆ దాహం తీర్చుకునే సంద‌ర్భం వ‌చ్చింది. ఆది స‌ర‌స‌న గ‌ర‌మ్ మూవీలో ఓ రేంజులో డ్యాన్సుల‌కు స్కోప్ దొరికింది. ఇంకేం ఉంది. త‌న‌లో ఉన్న అన్ని కోణాల్ని చూపించింది అమ్మ‌డు. ఇంత‌కాలం ఎంత‌గానో ఓపిగ్గా ఎదురు చూసింది అదాశ‌ర్మ‌. నాలో ఒగ‌లున్నాయ్‌, గిగ‌లున్నాయ్‌. డ్యాన్సుల‌తో హోరెత్తించే ట్యాలెంటు ఉంది. కానీ వాటిని చూపించే ఛాన్సే రాలేదు ఇంత‌వ‌ర‌కూ అంటూ ప‌లుమార్లు వాపోయిన ఈ అమ్మ‌డికి స‌రైన ప్లాట్‌ ఫాం దొరికింది. త‌న‌లోని డ్యాన్సింగ్ స్కిల్స్‌ ని పూర్తి స్థాయిలో చూపించే ఛాన్సొచ్చింది ఇప్ప‌టికి. గ‌ర‌మ్ మూవీలో గ‌ర‌మ‌గ‌ర‌మ స్టెప్పుల‌తో చిత‌క్కొట్టేసింది. వ‌య్యారి భామ స‌య్యాడుదామ ఉయ్యాల ఊపుతోంది ప్రేమా .. అంటూ ఓ హాట్ పెప్పీ సాంగ్ గ‌ర‌మ్ మూవీలో ఉంది.

నిన్న‌నే ఆడియో వేడుక‌లో ఓ చిన్న బిట్‌ ని శాంపిల్‌ కి వ‌దిలారు. ఇందులో అదాశ‌ర్మ ఊపులు కుర్ర‌కారులో హుషారు పెంచాయి. అదా ఓ రేంజులో రెచ్చిపోయి డ్యాన్సులు చేసింది. త‌న‌లో ఎంత ఉందో అంతా ఆ ఒక్క సాంగ్‌ లోనే చూపించింది. అంత క్యూట్‌ గా , అమాయ‌కంగా క‌నిపించే అదాలో మాస్ మ‌హారాణీ కోణం బైటికొచ్చింది. అమ్మ‌డిలో అస‌లు సిస‌లు విష‌యం వేరేగా ఉందే, మ‌రీ ఇంత మాసీగా ఉందేంటి? అనిపించే రేంజులో స్టెప్పులేసింది. అదీ మ్యాట‌రు.