Begin typing your search above and press return to search.
ఆదా.. ఎక్కువైతే ఇలా ఉంటుంది
By: Tupaki Desk | 14 Nov 2015 5:30 PM GMTగ్లామర్ ఇండస్ట్రీలో ఏది తక్కువైనా పర్లేదు కానీ.. లేటెస్ట్ ఫ్యాషన్ ఫాలో అవకపోతే మాత్రం తాటాకులు కట్టేస్తారు. అందుకే హీరోయిన్లు లేటెస్ట్ ట్రెండ్ ని జాగ్రత్తగా ఫాలో అయిపోతుంటారు. వీలైనంతవరకూ సొంత స్టయిల్ ని సృష్టించేందుకు ట్రై చేసే భామల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ భామ మాత్రం కొత్తగా ట్రై చేద్దామని అనుకుందో.. లేక ఎలా ఉన్న పర్లేదు అనుకుందో ఏమే కానీ.. చూసేవాళ్లని చిరాకు పెట్టించేసింది.
ఆదా శర్మ.. ఈ ముద్దుగుమ్మకి కెరీర్ లో హిట్స్ అయితే ఉన్నాయి కానీ.. పేరు తెచ్చినవి ఏమీ ఉండడం లేదు. పూరీ తీసిన హార్ట్ ఎటాక్ తో ఓ మోస్తరు హిట్ అందుకుని, తర్వాత బన్నీతో కలిసి సన్నాఫ్ సత్యమూర్తిలో చేసింది. అది కూడా పెద్ద హిట్ అయింది. మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ మూవీ సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంలోనూ మెరిసింది. ఇన్ని చేసినా లక్కు కలిసి రాని ఈ పిల్ల ఇప్పుడు ఆది తో కలిసి గరం అనే మూవీ చేస్తోంది.
రీసెంట్ గా గరం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. సినిమా పేరుకు తగ్గట్టు గరంగరంగానే రెడీ అయి వచ్చింది హీరోయిన్ ఆదా శర్మ. గులాబీ పూల డిజైన్ ఉన్న చిట్టి పొట్టి టాప్ ఒకటి వేసుకొచ్చింది కానీ.. చేతికి ఓ బ్రౌన్ కలర్ కాజువల్ వాచ్, బిస్కెట్ కలర్ లో కాజువల్ షూస్ తో కనిపించింది. ఈ తరహా డ్రస్సింగ్ ని.. హీరోయిన్లే కాదు.. కాజువల్ గా కూడా ఎవరూ ఫాలో అవరు. ట్రెండ్ అంటే క్యాచీగా ఉండాలి కానీ.. వింతగా చూసేట్టు కాదనే విషయం ఎవరూ ఆదాకి చెప్పలేదనుకుంట. లేకపోతే తనే సొంతగా డిజైన్ చేసేసుకుందో. స్టయిలింగ్ అంటే కాస్త ఖర్చుపెట్టాలమ్మా ఆదా.. ఇలాంటి విషయాల్లో ఆదా చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయం ఎవరైనా చెబ్తే బాగుండు ఈ భామకి.