Begin typing your search above and press return to search.

యాక్సిడెంట్ లో విజయ్ దేవరకొండ హీరోయిన్‌ కు తీవ్ర గాయాలు

By:  Tupaki Desk   |   25 July 2021 6:30 AM GMT
యాక్సిడెంట్ లో విజయ్ దేవరకొండ హీరోయిన్‌ కు తీవ్ర గాయాలు
X
తెలుగు ప్రేక్షకులకు విజయ్‌ దేవరకొండ నటించిన 'నోటా' చిత్రంతో సుపరిచితురాలు అయిన తమిళ హీరోయిన్ యాషిక ఆనంద్ కు కారు యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం అర్థరాత్రి సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. చెంగల్ పట్టు జిల్లా మామల్లపురం వద్ద యాషిక ప్రయాణిస్తున్న కారు స్పీడ్‌ గా డివైడర్‌ కు ఢీ కొట్టింది. దాంతో కారు ఫల్టీలు కొట్టినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారులో ఉన్న యాషికకు తీవ్ర గాయాలు అవ్వగా పక్కనే ఉన్న ఆమె స్నేహితురాలు భవాని మృతి చెందారు.

యాషిక ఆనంద్‌ స్నేహితురాలు వల్లిశెట్టి భవాని హైదరాబాద్ లో సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఇటీవలే భవాని తమిళనాడు వెళ్లినట్లుగా సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన తీరు తల్చుకుంటే భయంగా ఉందని.. అత్యంత స్పీడ్ గా ఉన్న కారు డివైడర్‌ ను బలంగా ఢీ కొట్టడం వల్ల కారు గాలిలో ఫల్టీలు కొట్టిందని.. కారు కింద పడ్డ వెంటనే అందులో నుండి యాషిక బయటకు వచ్చింది. కాని భవాని అందులో నుండి బయటకు రాలేక పోయింది.

పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున కారు ను రోడ్డు నుండి పక్కకు తొలగించి ఆ తర్వాత అక్కడ నుండి భవాని మృత దేహంను పోస్ట్‌ మార్టంకు తీసుకు వెళ్లారు. తీవ్రంగా గాయ పడ్డ యాషికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యాషిక పరిస్థితి కూడా విషమంగా ఉందని.. ఆమె ఆరోగ్య పరిస్థితి విషయంలో వైధ్యులు ఇప్పుడే ఏం చెప్పలేమన్నట్లుగా స్పందించారంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. యాక్సిడెంట్‌ కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. కారు డ్రైవ్‌ చేసిన సమయంలో మద్యం తాగి ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. మద్యంతో పాటు అతి స్పీడ్‌ వల్ల కారును కంట్రోల్‌ చేయలేక పోవడం వల్ల ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.