Begin typing your search above and press return to search.

విచారణకు 4 గంటలు ఆలస్యంగా వచ్చిన నటి.. అధికారులు సీరియస్

By:  Tupaki Desk   |   23 Oct 2021 8:00 PM IST
విచారణకు 4 గంటలు ఆలస్యంగా వచ్చిన నటి.. అధికారులు సీరియస్
X
క్రూయిజ్ డ్రగ్స్ ఎపిసోడ్ కు సంబంధించిన ఇప్పటికే పెను సంచలన అంశాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ ఉదంతంలో బాలీవుడ్ బాద్షా షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో సహా పలువురు ప్రముఖుల పిల్లల్ని అదుపులోకి తీసుకోవటం.. వారిని రిమాండ్ చేయటం.. ఇప్పటికి పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికి కోర్టు నుంచి సానుకూల స్పందన రాకపోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆర్యన్ సెల్ ఫోన్ ను విశ్లేషించే క్రమంలో.. నటి అనన్య పాండేతో జరిగిన వాట్సాప్ చాట్ వెల్లడైంది. ఇందులో డ్రగ్స్ కు సంబంధించిన వివరాలు ఉండటంతో ఆమెను ఎన్ సీబీ అధికారులు విచారణకు రావాలన్నారు.

ఇప్పటికే ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన వారు.. విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. దీంతో గురువారం ఆమె విచారణకు హాజరయ్యారు. రెండు గంటల పాటు విచారణ అనంతరం.. శుక్రవారం ఉదయం 11 గంటలకు మరోసారి రావాలని చెప్పారు. అధికారుల ఆదేశాలకు భిన్నంగా అనన్య మూడు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం రెండు గంటల సమయానికి విచారణకు హాజరయ్యారు.

దీంతో.. విచారణ అధికారులుఆమెపై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదేం సినిమా షూటింగ్.. ప్రొడక్షన్ హౌజ్ కాదు.. కేంద్ర దర్యాప్తు సంస్థ కార్యాలయమని.. సమయ పాలన తప్పనిసరిగా పాటించాలని చెప్పినట్లుగా తెలిసిందే. శుక్రవారం దాదాపు నాలుగు గంటల పాటు విచారించిన అధికారులు.. ఆర్యన్ ఖాన్ తో జరిపిన చాటింగ్ గురించి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. తాను డ్రగ్స్ ను ఎప్పుడూ తీసుకోలేదని.. మాదకద్రవ్యాల్ని ఎప్పుడూ తీసుకోలేదని.. ఎవరికి సరఫరా చేయలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. విచారణకు ఆలస్యంగా రావటంతో ఆమెను గట్టిగా మందలించినట్లుగా తెలుస్తోంది. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.