Begin typing your search above and press return to search.

పొట్టి నిక్కరులో అందాల వేదిక

By:  Tupaki Desk   |   29 Dec 2022 3:55 AM GMT
పొట్టి నిక్కరులో అందాల వేదిక
X
2006 నుంచి సినిమా ప్రపంచంలో కొనసాగుతున్న అందాల వేదిక మొదట్లోనే క్యూట్ హీరోయిన్ గా మంచి గుర్తింపును అందుకుంది. అంతేకాకుండా వచ్చిన కొత్తలోనే ఈ బ్యూటీ విభిన్నమైన తరహాలో సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. కేవలం మాస్ కమర్షియల్ సినిమాలో మాత్రమే కాకుండా హారర్ సినిమాలు కూడా చేసింది.

ముఖ్యంగా రాఘవ లారెన్స్ తో చేసిన ముని సినిమా ఆమెకు బాగా కలిసి వచ్చింది. ఇక తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా తమిళ్ తెలుగు అలాగే కన్నడ చిత్ర పరిశ్రమలో వరుసగా అవకాశాలు అందుకుంది. ఆమె కెరీర్ లో పెద్దగా స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోయినప్పటికీ కూడా మీడియం రేంజ్ హీరోలతో మాత్రం బాగానే వర్క్ చేసింది. ఇక తెలుగులో అయితే బాణం సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు అందుకుంది.

అప్పట్లో మాత్రం చాలా క్యూట్ లుక్ తో ఆకట్టుకునేది. కానీ ఇప్పుడు మాత్రం వేదిక పూర్తిస్థాయిలో తన స్టైల్ ను మార్చేసింది. గ్లామరస్ బ్యూటీల నుంచి పోటీ ఎక్కువ రావడంతో ఆమె కూడా గ్లామర్ డోస్ పెంచే ప్రయత్నం చేస్తుంది. మూడు పదుల వయసు దాటినా కూడా ఇంకా 16 ఏళ్ల అమ్మాయి తరహాలోనే కనిపిస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా అమ్మడు అలాగే పొట్టి జీన్స్ నిక్కర్ లో చాలా అందంగా కనిపించింది.

గతంలో బికినీ అందాలతో కూడా మైమరిపించిన బ్యూటీ ఇప్పుడు ఈ లుక్ లో మాత్రం చాలా ఘాటుగా ఉంది అంటూ ఫాలోవర్స్ అయితే పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక వేదిక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది.

ముఖ్యంగా కన్నడ తమిళ ఇండస్ట్రీలో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే తెలుగు తమిళ్ హిందీలో కలిపి మొత్తంగా 6 సినిమాలో అయితే చేస్తోంది. ముఖ్యంగా తమిళ్ తెలుగులో జంగిల్ అనే ఒక ద్విభాషా సినిమా కూడా చేస్తోంది. అలాగే కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి కూడా ఈ బ్యూటీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.