Begin typing your search above and press return to search.

వైట్ లో వేదిక వెలుగు జిలుగులు

By:  Tupaki Desk   |   11 Nov 2017 11:45 AM IST
వైట్ లో వేదిక వెలుగు జిలుగులు
X
దక్షిణాదిలో పలు భాషల్లో నటించిన బ్యూటీ వేదిక. తెలుగులోనూ ఈ అందాల భామ పలు చిత్రాలలో నటించింది. విజయ దశమి చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈమె.. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో తెగ బిజీగా ఉంది. తమిళ్ లో బాల తెరకెక్కించిన పరదేశి చిత్రంలో చేసిన అంగమ్మ కేరక్టర్ తో చాలానే గుర్తింపు సంపాదించిన ఈమెకు.. పెర్ఫామెన్స్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు ఉంది.

సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉండే వేదిక.. ఇప్పుడు ఓ సూపర్బ్ పిక్ ను నెట్ లో షేర్ చేసింది. వైట్ టాప్ లో సముద్రం ఒడ్డున బీచ్ లో ఇసుకపై నటిస్తున్న ఓ ఫోటోను అభిమానులకు గిఫ్ట్ ఇచ్చింది వేదిక. దాదాపు ట్రాన్స్ పరెంట్ గా ఈ వైట్ టాప్ లో వేదిక అందాలు తెగ మెరిసిపోతున్నాయి. అందాల ప్రదర్శనలో తనకు పెద్దగా హద్దులేమీ లేవని చెప్పేందుకు ఇంతకంటే మంచి ఐడియా మరోటి ఉండదేమో అనిపించక మానదు. పైగా.. నో ఫిల్టర్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి తన ఒరిజినల్ అందాలే ఈ స్థాయిలో ఉంటాయని చెప్పకనే చెప్పింది వేదిక.

చివరగా ఆరేళ్ల క్రితం తెలుగులో దగ్గరగా దూరంగా అనే చిత్రంలో నటించిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో తమిళ్.. మలయాళం రెండూ కలిపి దాదాపు అరడజన్ కు పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న కాంచన3 కూడా ఉండడం విశేషం.