Begin typing your search above and press return to search.

వీడియో : మళ్లీ చెఫ్‌ అవతారం ఎత్తింది

By:  Tupaki Desk   |   20 Jun 2020 8:50 AM GMT
వీడియో : మళ్లీ చెఫ్‌ అవతారం ఎత్తింది
X
సెలబ్రెటీలు గత మూడు నెలలుగా షూటింగ్స్‌ లేకపోవడంతో ఇంటి పనుల్లో బిజీ అయ్యారు. హీరోలు హీరోయిన్స్‌ దర్శకులు ఇలా అంతా కూడా తమకు చేతనైనంత వరకు ఇంట్లో వారికి ఇంటి పనిలో సాయం చేస్తూ ఉన్నారు. కొందరు వాటికి సంబంధించిన ఫొటోలు వీడియోలు షేర్‌ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆ విషయాలను బయటకు చెప్పుకునేందుకు ఇష్టపడటం లేదు. హీరోయిన్‌ పూజా హెగ్డే మాత్రం రెగ్యులర్‌ గా వంటింట్లో సందడి చేస్తుందట.

కొన్ని రోజుల క్రితం సోషల్‌ మీడియాలో వంట చేస్తున్న ఫొటోలను షేర్‌ చేసిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఈసారి మరో వంటతో నెట్టింట్లో సందడి చేసింది. మస్రూమ్‌ రైస్‌ ఇంకా ప్రత్యేకమైన చికెన్‌ వంటకంను స్వయంగా తానే తయారు చేసింది. వీడియోలో ఆ వంటను ప్లేట్‌ లో వడ్డిస్తూ తన ఫాలోవర్స్‌ ను ఊరిస్తుంది. మొత్తానికి ఈ ఫ్రీ టైంను పూజా హెగ్డే వంటల్లో స్పెషలిస్ట్‌ గా తనకు తానే మల్చుకుంది.

ప్రస్తుతం ఈమె తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ప్రభాస్‌ తో ఒక సినిమా కాగా రెండవది అఖిల్‌ అక్కినేని హీరోగా నటిస్తున్న మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌. ఈ రెండు చిత్రాలు కూడా పూజా హెగ్డే క్రేజ్‌ ను మరింతగా పెంచుతాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రం షూటింగ్‌ చివరి దశకు రాగా ప్రభాస్‌ మూవీ ఇంకా చాలానే బ్యాలన్స్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది.