Begin typing your search above and press return to search.
త్రిష ఎక్స్ తో డేటింగ్ లో ఉందట
By: Tupaki Desk | 7 May 2023 12:00 PMఆవకాయ్ బిర్యానీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బిందు మాధవి. ఈ సినిమా తనకు మంచి ప్రశంసలను తీసుకువచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించింది బిందు మాధవి. అవేవీ తనకు పెద్దగా పేరు, గుర్తింపు తీసుకురాలేదు. అలా క్రమంగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇదే క్రమంలో బిగ్ బాస్ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసింది బిందు మాధవి.
ఆడపులి లాంటి వైఖరితో అందరు కంటెస్టెంట్లను వెనక్కి నెట్టి మరీ బిగ్ బాస్ ఓటీటీ టైటిల్ ను అందుకుంది బిందు మాధవి. ఆ తర్వాత తనకు మళ్లీ అవకాశాలు రావడం మొదలైంది. వరుసగా వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫామ్ లోకి వచ్చేసింది. ఈ మదనపల్లి బ్యూటీ తాజాగా న్యూసెన్స్ అనే చిత్రంలో నటించింది. మే 12వ తేదీన ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో న్సూసెన్స్ విడుదలకానుంది.
తాజాగా న్యూసెన్స్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంది బిందు మాధవి. నటీనటులు నవదీప్, బిందు మాధవి సహా డైరెక్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా నవదీప్, బిందు మాధవిలపై సోషల్ మీడియాలో వచ్చిన గాసిప్ లను ఒక్కొక్కటిగా చదువుతూ నిజమా కాదా అని అడిగారు. నవదీప్ గురించి ప్రశ్నలు అడిగిన తర్వాత బిందు మాధవిని ప్రశ్నలు అడిగింది యాంకర్.
బిందు మాధవిపై ఎలాంటి రూమర్స్, గాసిప్స్ లేవని.. కేవలం ఒక్క విషయం గురించి ఇంటర్నెట్ లో దొరికిందని అదే అడుగుతున్నానంటూ యాంకర్ చెప్పుకొచ్చింది. త్రిష బాయ్ ఫ్రెండ్ తో మీరు డేటింగ్ లో ఉన్నారనే రూమర్ వినిపిస్తోంది. అది నిజమా కాదా అని యాంకర్ అడిగింది.
దానికి స్పందించిన బిందు మాధవి. ఆ ప్రశ్నను దాటవేసే ధోరణిలో కాకుండా నేరుగా సమాధానం చెప్పింది. ఔను నిజమే.. కానీ టూ డిఫరెంట్ టైం జోన్లలో అని చెప్పుకొచ్చింది. త్రిషతో బ్రేకప్ అయిన తర్వాత తనతో డేట్ చేస్తున్నానని కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పేసింది. బిందు మాధవి అలా చెప్పడం చాలా మందిని ఆకట్టుకుంది. దాచుకోవాలని అనుకోకుండా ఇలా నేరుగా చెప్పడం వల్ల మంచి ఇంప్రెషన్ అందుకుందని నెటిజన్లు అంటున్నారు.