Begin typing your search above and press return to search.

ప్రభాస్ గుర్తులేడా త్రిష?

By:  Tupaki Desk   |   13 Nov 2022 4:01 AM GMT
ప్రభాస్ గుర్తులేడా త్రిష?
X
బ్యూటిఫుల్ హీరోయిన్ త్రిష కృష్ణన్ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 20 ఏళ్లు దాటినప్పటికీ కూడా ఇంకా అదే తరహాలో క్రేజ్ అందుకుంటుంది. ఆమె వయసుతో సంబంధం లేకుండా నేటి తరం కుర్రాళ్లను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. సాధారణంగా కొంతమంది హీరోయిన్లు 30 ఏళ్ళ వయసులోకి రాగానే ఇప్పుడు వారి వయసుకు తగ్గ పాత్రలో నటిస్తున్నారు.

కానీ త్రిష మాత్రం అందుకు భిన్నంగా ముందుకు సాగుతొంది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను కూడా అందుకుంటుంది. ప్రస్తుతం అయితే ఆమె తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. తెలుగులో అనుకున్నంతగా అవకాశాలు అయితే రావడం లేదు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో త్రిష ఒక పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. అంతేకాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ ఆ పోస్ట్ పై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇటీవల ప్రభాస్ 20 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని అతని సినిమాలను థియేటర్లలో ప్రదర్శించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈశ్వర్ తో పాటు వర్షం సినిమాను కూడా ప్రదర్శించారు. ఇక సోషల్ మీడియాలో వర్షం సినిమాకు సంబంధించిన కొంత హడావిడి అయితే కనిపించింది. థియేటర్లలో అభిమానులు చాలా ఉత్సాహంగా కనిపిస్తూ వీడియోలను పోస్ట్ చేశారు. అయితే ఒక ఫ్యాన్స్ ఒక వీడియోలో సందడి చేస్తున్న విధానంపై త్రిష స్పందించింది.

ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మీ కారణంగానే నేను ఇక్కడ ఉన్నాను అంటూ ఆమె తన ఫ్యాన్స్ ఉన్నట్లుగా స్పందించడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక విధంగా ఈ హడావిడి కి కారణం కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆమె ప్రభాస్ గురించి గానీ అతని ఫాన్స్ గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని ఓ వర్గం ఫాన్స్ అయితే అప్సెట్ అయ్యారు. అసలు ప్రభాస్ గుర్తున్నాడా అనే విధంగా కామెంట్ చేస్తున్నారు.