Begin typing your search above and press return to search.
బాంబే హీరోయిన్స్ మెంటల్ గా కమిట్మెంట్ కి ప్రిపేరై వస్తారు
By: Tupaki Desk | 14 Jun 2020 10:06 AM ISTతేజస్వి మదివాడ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేదు. మొదట్లో సిల్వర్ స్క్రీన్ పై క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన తేజస్వి.. ఆ తరవాత రోజుల్లో హీరోయిన్ గా మారింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' 'మనం' 'హార్ట్ ఎటాక్' 'కేరింత' 'ఐస్ క్రీమ్' 'జత కలిసే' సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే తెలుగమ్మాయి అయిన తేజస్వీకి వెండితెరపై ఓ మోస్తరు అవకాశాలే వచ్చాయని చెప్పవచ్చు. 'బిగ్ బాస్' రియాలిటీ షోలో పాల్గొనడం ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఈ షో లో గ్లామర్, ఆటలు, పాటలు, కోపాలు ఇలా అన్ని ఎమోషన్స్ చూపిస్తూ 'బిగ్ బాస్'ని కూడా ఆకట్టుకుంది. కాగా తేజస్వి ప్రస్తుతం 'కమిట్మెంట్' అనే సినిమాలో నటిస్తోంది. 'హైదరాబాద్ నవాబ్స్' 'పరిచయం' చిత్రాలను రూపొందించిన డైరెక్టర్ లక్ష్మీకాంత్ చెన్నా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పై లైంగిక వేధింపులతో పాటు పలు రంగాల్లో చోటుచేసుకొంటున్న వేధింపులను కథాంశంగా 'కమిట్మెంట్' రూపొందించారు. ఈ చిత్రం గురించి తేజస్విని ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
''ఇండస్ట్రీలో డేట్ చేద్దాం అని అడిగే వారి కన్నా ఐస్ క్రీమ్ కావాలా అని అడిగేవారు ఎక్కువ. నా దృష్టిలో అదే కాస్టింగ్ కౌచ్. టాలీవుడ్ లో చాలా మంది నన్ను కమిట్మెంట్ అడిగారు. వాటిని ఒప్పుకోలేక నేను సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్లు ముందుగానే కమిట్‌మెంట్ కు ప్రిపేర్ అయి వస్తున్నారు. ఆ క్యాటగిరీలో మనం ఉంటే ముందుకు సాగుతాం. లేకపోతే నాలాగా ప్రతిభ ఉన్నా రేసులో వెనుకబడి పోతాం అని తేజస్వి మదివాడ చెప్పారు. బాంబే హీరోయిన్స్ దేనికైనా ఒప్పుకొంటారనే ఏకైక కారణంతో వారిని తమ సినిమాల్లో పెట్టుకొంటున్నారు. బాలీవుడ్ నుంచి వచ్చే వారంతా అలా ఉంటారనే కాదు.. కొంతమంది వల్లే ఇలాంటి చెడ్డపేరు తెలుగు హీరోయిన్లకు వస్తుంది. ఈ విషయం తెలుగు అమ్మాయిలకు తమిళ అమ్మాయిలకు కూడా తెలుసు'' అని తేజస్వి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కాస్టింగ్ కౌచ్ వల్ల తన వ్యక్తిగత జీవితాన్ని కూడా కోల్పోయానని.. గతంలో నాకు ఒకరితో అఫైర్ ఉండేది.. అతడితో పెళ్లికి కూడా సిద్ధమయ్యాను. కానీ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చానని నాపై అనుమానం పడ్డారు. వర్మ సినిమాలో నటించావు నీవు అలాంటి పనులు చేయలేదంటే ఎలా నమ్మమంటావు అని నా మీద డౌట్ పడ్డారు. నేను అలాంటి దానిని కాదు ఎలా ప్రూవ్ చేసుకోవాలో అర్థం కాలేదని తేజస్వి వెల్లడించింది.
క్యాస్టింగ్ కౌచ్ ఎక్సపీరియన్స్ చేయడం కన్నా ఎస్కేప్ చేయడం మంచిది. ఎందుకంటే తర్వాత నువ్వు ఫీల్ అయి వారి మీద కంప్లీట్ చేసి పబ్లిక్ ఇష్యూ చేయడం కంటే ముందే ఇంట్రెస్ట్ లేదని తప్పుకుంటే మంచిదని సలహా ఇచ్చింది. అంతేకాకుండా గతంలో బాలీవుడ్ లో నవాజుద్దీన్ సిద్ధిఖీతో ఓ వెబ్ సిరీస్ లో ఛాన్స్ వచ్చింది. కాకపోతే దాంట్లో నగ్నం గా నటించాలని కండిషన్ పెట్టారు. ఆ సమయంలో నేను అలాంటి సీన్లు చేయడానికి ఒప్పుకోనని చెప్పాను. దాంతో ఆ ఆఫర్ నాకు దక్కలేదు. అలాంటి ఆఫర్లు కమిట్‌మెంట్, అశ్లీల పాత్రలు చేయలేక మిస్ చేసుకొన్నాను. ఆ తర్వాత సీనియర్ హీరోయిన్లను చూసి అన్ని రకాల పాత్రలు చేయాలని రియలైజ్ అయ్యానని తేజస్వి వెల్లడించారు. ఇప్పుడు నటిగా వ్యక్తిగా పరిణతి చెందాను. 'కమిట్మెంట్' చిత్రంలో నటిగా ఎక్కువ మెచ్యురిటీతో కనిపిస్తాను అని చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో తేజస్వితో పాటు 'కమిట్మెంట్' సినిమా దర్శకుడు లక్ష్మీకాంత్ కూడా పాల్గొన్నారు.