Begin typing your search above and press return to search.

మరోసారి డార్క్ గా.. మిల్కీ బ్యూటీ సై!

By:  Tupaki Desk   |   12 Dec 2018 2:35 PM IST
మరోసారి డార్క్ గా..  మిల్కీ బ్యూటీ సై!
X
భారతదేశంలో తెలుపు రంగు ఉన్నవారి పై వ్యామోహం ఎక్కువే.. కలర్ అనేది జీన్స్ ద్వారా వస్తుందని తెలిసినా ఎందుకో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ముఖ్యంగా అమ్మాయిల కు ఈ సమస్య చాలా ఎక్కువ. రకరకాల క్రీములు పూసి.. మేకప్పులు వేసుకొని 'తెల్లగా' గానిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక గ్లామర్ ఇండస్ట్రీలో ఇది ఇంకా ఎక్కువ గా ఉంటుంది. కానీ కొందరికీ ఈ కలర్ సమస్య అసలు ఉండదు. ఎందుకంటే వాళ్ళు అసరమైన దానికంటే ఎక్కువ ఫెయిర్ గా ఉంటారు. తమన్నా ఈ కేటగిరీలోనే ఉంటుంది.

అందుకే ఈ భామకు మిల్కీ బ్యూటీ అనే బిరుదిచ్చారు. కానీ ఈ సుందరికి నలుపు రంగులో కనిపించేందుకు ఏమాత్రం అభ్యంతరం లేదు. 'బాహుబలి: ది బిగినింగ్' లో మేకప్ సాయంతో తమన్నా కాస్త డార్క్ గా కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోయే రెండు సినిమాల్లో కాస్త నలుపు రంగులోనే కనిపిస్తుందట. తమన్నా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'సైరా' లో నటిస్తోంది. దీంతో పాటుగా 'దేవి-2' లో కూడా మిల్కీనే హీరోయిన్. ఈ రెండు సినిమాల్లో తన పాత్ర ప్రకారం డార్క్ గా కనిపించాల్సి వస్తుందట. దీంతో తనకు కరెక్ట్ గా సూట్ అయ్యే నలుపు షేడ్ కోసం 50 సార్లు లుక్ టెస్ట్ చేసుకొని.. ఫైనల్ గా ఒక షేడ్ కు ఫిక్స్ అయిందట.

ఏదేమైనా మన ఫిలిం మేకర్స్ తెలుపు రంగు వెంటబడకుండా పాత్ర ప్రకారం నలుపు రంగును యాక్సెప్ట్ చేస్తుండడం అభినందించదగిన పరిణామమే. ఇదిలా కంటిన్యూ అయితే ఎంతోమంది టాలెంటెడ్ హీరోయిన్లకు కలర్ అనే ఒక అడ్డంకి లేకుండా ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉంది.