Begin typing your search above and press return to search.

బన్నీ 19లో అడుగుపెట్టనున్న టబు

By:  Tupaki Desk   |   13 Jun 2019 10:13 AM GMT
బన్నీ 19లో అడుగుపెట్టనున్న టబు
X
అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హీరోతో పాటు పూజా హెగ్డే సుశాంత్ నవదీప్ రాహుల్ రామకృష్ణ తదితరులు పాల్గొంటున్న కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. త్వరలో సీనియర్ హీరోయిన్ టబు జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. జూన్ 21 నుంచి ఆవిడ సెట్లో ఉంటారట. టబు ఈ సినిమాలో బన్నీకి తల్లిగా మలయాళ నటుడు జయరాం తండ్రిగా నటిస్తారని ఇంతకు ముందే లీక్ వచ్చింది.

కానీ దాన్ని ధృవీకరిస్తూ యూనిట్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఎక్కువగా ఇదే నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫాదర్ మదర్ సెంటిమెంట్ ని పుష్కలంగా ఇందులో దట్టించినట్టు ఇప్పటికే టాక్ ఉంది. బాలకృష్ణతో పాండురంగడు చేశాక టబు నటిస్తున్న తెలుగు స్ట్రెయిట్ మూవీ ఇదే. ఆ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చిన గత ఏడాది అందాదున్ తో బాలీవుడ్ సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా మొదలుపెట్టిన టబుకి ఇటీవలే వచ్చిన దే దే ప్యార్ దే కూడా మరో కమర్షియల్ సక్సెస్ తన ఖాతాలో వేసింది.

వెంకటేష్ తో తీయబోయే రీమేక్ లో కూడా అదే పాత్ర తనకే ఆఫర్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ లో చాలా ముఖ్యమైన పాత్ర కాబట్టే ఒప్పుకున్నారని వినికిడి. వచ్చే సంక్రాంతికి విడుదల ప్లాన్ చేసిన బన్నీ-త్రివిక్రమ్ ల మూవీ టైటిల్ దసరాకు రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి. తమన్ స్వరాలు సమకూరుస్తుండగా ఇప్పటికే ట్యూన్స్ కంపోజ్ చేయడం పూర్తయ్యిందని ఇన్ సైడ్ టాక్.