Begin typing your search above and press return to search.

రాములమ్మ బదులు పండుని తెస్తారా

By:  Tupaki Desk   |   17 April 2019 4:30 AM GMT
రాములమ్మ బదులు పండుని తెస్తారా
X
స్టార్స్ కు ఏదో ఒక సినిమా కెరీర్ మొత్తం మీద ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుంది. అందులో నటించిన పాత్ర పేరో లేక ఆ మూవీ టైటిలో ఇంటి పేరుగా సైతం మారిపోతుంది. ఎన్నేళ్ళైనా వాళ్ళ పేరు చెబితే ఫలానా సినిమా వెంటనే గుర్తొచ్చేలా వాటి ప్రభావం తరాల తరబడి ఉంటుంది. లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న మాజీ హీరోయిన్ విజయశాంతి పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఒసేయ్ రాములమ్మే. అలాగే టబు తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా నాగార్జున నిన్నే పెళ్ళాడతాలో పండుగా చేసిన అల్లరి ముందు మిగిలిన పాత్రలన్నీ దిగదుడుపే.

ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటారా. నీది నాది ఒకే కథతో విమర్శకుల ప్రశంశలు అందుకున్న దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందబోయే అతని రెండో సినిమాలో రానా సాయి పల్లవి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే విరాట పర్వం 1992 అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ముందు ఈ పాత్రకు విజయశాంతిని అనుకున్నారట. కథ బాగా నచ్చిన ఆవిడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ కూడా వచ్చింది అయితే ఏవో రాజకీయ కారణాలు చూపుతూ ఆవిడ తప్పుకుందని ఫ్రెష్ అప్ డేట్.

ఆ స్థానంలో టబుని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. టబు అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో మూవీలో తల్లిగా నటిస్తున్న విషయం ఇప్పటికే ఖరారైపోయింది. ఇప్పుడిదీ ఒప్పుకుంటే టాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. హిందీలో అందాదున్ సక్సెస్ పుణ్యమా అని సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా సాగుతున్న టబుకు ఇక్కడ రీ ఎంట్రీలో అన్ని క్రేజీ అవకాశాలు రావడం గమనార్హం. విరాటపర్వం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుందని సమాచారం