Begin typing your search above and press return to search.

అబ్రకదబ్ర అనేసిన కలర్స్ స్వాతి!

By:  Tupaki Desk   |   18 April 2020 4:30 PM GMT
అబ్రకదబ్ర అనేసిన కలర్స్ స్వాతి!
X
ఒక హీరోయిన్ కు తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ అయింది.. లేదా భర్తతో విడాకులకు సిద్ధం అవుతోంది. ఇది ఎలా తెలుస్తుందంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి హీరోయిన్ స్వయంగా 'నేను ఇక సింగిల్.. రెడీ టు మింగిల్' అని ప్రకటించడం. ఇది ఓపెన్ గా ఉండే వ్యక్తులు చేసే పని. ఇక రెండో రూట్ ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్/భర్త తో కలిసి ఉన్న ఫోటోలను.. వీడియోలను ఇతర లవ్ మెసేజిలను కసికసిగా డిలీట్ కొట్టి ఉంటారు కదా. ఇలా జరిగితే బ్రేకప్పు అయినట్టేనని నెటిజన్లు నిర్ధారణకు వచ్చేస్తారు. త్రిష.. ఇలియానా లాంటి సుందరీమణులు ఇలాగే తమ బ్రేకప్ ను తెలిపారు. రీసెంట్ గా స్వాతి రెడ్డి(కలర్స్ స్వాతి) తన ఇన్ స్టా ఖాతా ద్వారా తన భర్త వికాస్ తో కలిసి ఉన్న ఫోటోలను లేపేసింది దీంతో అందరికీ బ్రేకప్ అనుమానాలు వచ్చాయి. కథనాలు కూడా వచ్చాయి.

అయితే.. ఈ విషయం స్వాతి వరకూ వెళ్లడంతో బ్రేకప్ విషయంపై పరోక్షంగా సెటైరికల్ గా స్పందించింది. ఇన్ స్టాగ్రామ్ లో 2012 నుంచి ఉన్న ఫోటోలను ఆర్కైవ్ చేసానని వీడియో ద్వారా తెలిపింది. వీడియోలో తన ఫోన్ లో ఇన్ స్టాగ్రామ్ పేజిలో ఆర్కైవ్స్ ఫోల్డర్ ఓపెన్ చేసి.. అందులో దాచి ఉంచిన అన్ని ఫోటోలను స్క్రాల్ చేస్తూ చూపించింది. దీనికి ఆసక్తికరంగా హ్యారీ పోటర్ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లే చేసింది. అంతే కాదు. హ్యారీ పోటర్ లోని ఓ సంభాషణను క్యాప్షన్ లా పోస్ట్ చేసింది.

"డాబీ: డాబీ కి సరైన చోటు తెలుసు సర్. దాన్ని కమ్ అండ్ గో రూమ్ అంటారు. లేదా రిక్వైర్ మెంట్ రూమ్ అంటారు.
హ్యారీ పోటర్: ఎందుకు?
డాబీ: ఎందుకంటే నిజంగా అవసరం ఉన్నవారే ఆ రూమ్ లోకి అడుగుపెట్టగలరు. కొన్ని సార్లు అది ఉంటుంది. కొన్నిసార్లు అది ఉండదు. అయితే అది కనిపించినప్పుడు సాధకుడికి కావలసిన వాటిని అన్నిటినీ చూపిస్తుంది.
#2012 నుంచి ఇన్ స్టా గ్రామ్. నా ప్రయాణం.. నా ప్రొఫైల్.. నా మ్యాజిక్ బాక్స్"

మనకు హాటు/ఘాటు క్యాప్షన్లు తెలుసు కానీ ఇలాంటి హ్యారీ పోటర్ స్టైల్ మ్యాజిక్ క్యాప్షన్లు తెలియవు కదా. ఈ పోస్టుతో బ్రేకప్పు కాలేదని ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టే. ఇంకోసారి ఇలాంటి గాసిప్పులు వస్తే 'లార్డ్ అఫ్ ది రింగ్స్' లోని డైలాగుతో క్లారిటీ ఇస్తుందేమో మరి!