Begin typing your search above and press return to search.

సుశాంత్ ఆత్మహత్య తర్వాతే ఈ ప‌త‌నం!

By:  Tupaki Desk   |   23 Aug 2022 4:49 AM GMT
సుశాంత్ ఆత్మహత్య తర్వాతే ఈ ప‌త‌నం!
X
బాలీవుడ్ లో ర‌క‌ర‌కాల అంశాల‌పై మాట్లాడుతూ న‌టి స్వ‌రాభాస్క‌ర్ నిరంత‌రం వివాదాల్లో న‌లుగుతున్నారు. తాజాగా స్వరా భాస్కర్ బాలీవుడ్ లో బహిష్కరణ పోకడలపై స్పందించారు. నార్త్ వర్సెస్ సౌత్ చర్చపై కూడా ఆమె వ్యాఖ్యానించారు. పూర్తిగా బాలీవుడ్ ని నిందించ‌డం స‌రికాద‌ని కూడా అన్నారు.

'జహాన్ చార్ యార్' సినిమాతో నాలుగేళ్ల తర్వాత స్వరా భాస్కర్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. కమల్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలీవుడ్ బ్యాన్ ట్రెండింగులో ఉన్న‌ సమయంలో విడుదల కానుంది. ప్ర‌ముఖ జాతీయ మీడియాతో స్వ‌రా మాట్లాడుతూ ప‌లు అంశాల‌ను ఉటంకించింది. బహిష్కరణ పోకడల గురించి స్వ‌రా వ‌ద్ద ప్ర‌స్థావించ‌గా... ఒక‌రి వైఫల్యాన్ని సెలబ్రేట్ చేసుకోవడంపై తనకు నమ్మకం కానీ ఆస‌క్తి కానీ లేదని స్వరా తెలిపింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతరం బాలీవుడ్ పై ద్వేషం పెంచడమే ప్రస్తుత ట్రెండ్ అని కూడా ఆమె పేర్కొంది.

ఒకరి వైఫల్యాన్ని సెలబ్రేట్ చేయడం వెర్రిత‌నం లేదా చిన్నతనం అని అన్నారు. నార్త్ వర్సెస్ సౌత్ డిబేట్ గురించి స్వరా మాట్లాడుతూ ''ఈ రకమైన విభజన నాకు ఇష్టం లేదు'' అని అన్నారు. ఆర్టిస్టులుగా పరిశ్రమగా బాక్సాఫీస్ వద్ద సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తే అందరికీ మంచిదని నేను భావిస్తున్నాను. ఒకరి వైఫల్యాన్ని విభజించి సెల‌బ్రేట్ చేసుకోవడం లేదా వేరొకరి విజయాన్ని చూసి అసూయపడడం అసూయపడడం చాలా వెర్రిత‌నం .. చిన్నత‌నం అని నేను భావిస్తున్నాను.

మనం కోవిడ్ నుండి బయటికి వస్తున్నాం. ప్ర‌తిదీ మనం చాలా సరళంగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా వినాశకరమైన స‌న్నివేశం.. ముఖ్యంగా పంపిణీదారులు -థియేటర్ యజమానులకు .. ఎగ్జిబిటర్లు. ..ప్రజలు సినిమాల గురించి మాట్లాడేటప్పుడు నటీనటులు మాత్రమే ప‌రిశ్ర‌మ‌ కాదు అనే విషయాన్ని మరచిపోతారు. మీరు ఒక నటుడు లేదా న‌టిని ఇష్టపడకపోతే కోపంలో బంధుప్రీతి గురించి మాట్లాడవచ్చు.. కానీ సినిమా పరిశ్రమ వాస్తవానికి ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఇది ప్రజలకు ఉద్యోగాలు ఇస్తుంది'' అన్నారు. ''ఒక సినిమా విఫలమైతే సెల‌బ్రేష‌న్ జ‌రుపుకోవ‌డం వ‌ల్ల క‌లిసొస్తుందా?'' అని ప్ర‌శ్నించారు.

బహిష్కరణ పోకడలను ప్రస్తావిస్తూ స్వరా ఇంకా ఇలా పేర్కొన్నారు, ''ట్విటర్ లో సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ ఉంది. వారు బాలీవుడ్ ను పడగొట్టాలని కోరుకుంటారు. నెటిజ‌నులు తెలివితక్కువ పేర్లతో పిలుస్తారు. నేను దీన్ని చాలా అసహ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ వ్యక్తులు వారి గుడ్డి ద్వేషం వ‌ల్ల‌ బాలీవుడ్ చాలా మందికి జీవనోపాధిని ఇస్తుందనే విషయాన్ని మరచిపోతున్నారు'' అని అన్నారు.

అన్ని సౌత్ సినిమాలు బాగా ఆడుతున్నాయా?

దక్షిణాది సినిమాలు బాగా ఆడుతున్నంత వరకు కొన్నాళ్ల పాటు మీడియా జ‌న‌ర‌లైజ్ చేస్తుంది. RRR- పుష్ప- KGF .. సినిమాలు బాగా ఆడాయి. కానీ సౌత్ లో చాలా సినిమాలు రిలీజ్ అవడం లేదు. సౌత్ లో రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ అయినట్లే కాదు.. హిట్ అవుతున్న వాటి గురించి వింటున్నాం. అంటే బాలీవుడ్ లో కూడా భూల్ భులయ్యా 2- గంగూబాయి సినిమాలు వచ్చాయి. గత సంవత్సరం అంతటా బాలీవుడ్ తిరోగమనంలో ఉంద‌ని నేను అంగీకరిస్తున్నాను. కారణం ఏదీ లేదని నేను భావించ‌ను.. చాలా కారణాలు ఉన్నాయి.

బాలీవుడ్ పతనం వెనుక ఉన్న వివిధ కారణాలను స్వరా వివరిస్తూ.. దేశం ఆర్థిక మాంద్యంలో ఉందని అనురాగ్ చెప్పిన‌దానికి అంగీక‌రిస్తున్నాన‌ని స్వ‌రా చెప్పారు. ప్ర‌జ‌లు చాలా ఖర్చు చేయాల్సిన ప‌రిస్థితి ఉంది. వినోదం కోసం ఖ‌ర్చు చేయ‌లేని స్థితి క‌నిపిస్తోంది. అందరూ బాలీవుడ్‌ని నిందిస్తున్నారు.. ప్రజలు థియేటర్ కి రాకపోవడానికి బాలీవుడ్‌దే బాధ్యత అని అంటున్నారు. ఇది పూర్తిగా క‌రెక్ట్ కాద‌ని స్వ‌రా అన్నారు.

సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ కు గుర్తింపు వచ్చిందని కూడా స్వ‌రా అంది. COVID తర్వాత ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వెళ్లడానికి ఇష్టపడలేదని అన్నారు. OTT వచ్చి నిజంగా థియేట్రిక‌ల్ వీక్షణ అనుభవానికి అంతరాయం కలిగించిందని కూడా స్వ‌రా అంగీక‌రించారు.