Begin typing your search above and press return to search.

ఈ బ్యూటీకి ఎవరితో క్రష్ లేదట.. ఉన్నా చెప్పదట..

By:  Tupaki Desk   |   15 Aug 2021 8:30 AM GMT
ఈ బ్యూటీకి ఎవరితో క్రష్ లేదట.. ఉన్నా చెప్పదట..
X
వారం తిరిగేసరికి అరడజను సినిమాలకు తగ్గకుండా విడుదలవుతున్న పరిస్థితి. సెకండ్ వేవ్ తర్వాత సినిమా థియేటర్లు ఆలస్యంగా ఓపెన్ కాకపోవటం.. తెలంగాణలో పరిస్థితి ఓకే అయినా.. ఏపీలో మాత్రం థియేటర్లు ఇప్పటికి సరిగా తెరుచుకున్నది లేదు. ఒకవేళ తెరిచినా.. కరెంటు బిల్లుకు సరిపడా డబ్బులు కూడా రాని పరిస్థితి. అందుకే.. నిబంధనల్ని సడలించే వరకు సినిమాలు వేయకూడదన్న నిర్ణయాన్ని ఏపీలోని చాలామంది థియేటర్ యజమానులు డిసైడ్ అయ్యారు. ఈ కారణంతోనే.. సెకండ్ వేవ్ తర్వాత సరైన పెద్ద సినిమాను థియేటర్లో విడుదల చేయటానికి ఏ నిర్మాత ముందుకు రావట్లేదు.

దీంతో.. చిన్న సినిమాలు.. మామూలు రోజుల్లో థియేటర్లు కూడా దొరకని సినిమాలకు.. రెండేసి థియేటర్లలో బొమ్మ వేసేస్తున్న పరిస్థితి. ఈ వారం విషయానికి వస్తే.. అంతో ఇంతో బజ్ వినిపిస్తున్న చిత్రం ‘రాజ రాజ చోర’. శ్రీవిష్ణు కథానాయకుడిగా.. సనయిన హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీకి హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక.. సనయన విషయానికి వస్తే.. ‘నారింజ మిఠాయి’ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ నాగపూర్ పోరికి తెలుగు బాగా మాట్లాడుతుంది. ఇప్పటికే తమిళ చిత్రాల్లో నటించింది. నారింజ మిఠాయి కూడా తమిళ డబ్బింగ్ చిత్రమే.

ఈ సినిమాలో ఆమె నటన చూశాకే దర్శకుడు తాజా మూవీలో ఆమెను ఫైనల్ చేశారట. కథ విన్నాక ఓకే చెప్పేసిందట. ఇక.. తన గురించి చెబుతూ.. నాగపూర్ లో పుట్టి పెరిగినప్పటికి తెలుగు వచ్చని చెప్పింది. తెలుగులో టెన్త్ క్లాస్ మూవీ చేసినా.. పెద్దగా అవకాశాలు రాకపోవటం.. తమిళంలో ఎక్కువ రావటంతో అక్కడకు వెళ్లిపోయిందట.

తనకు క్రష్ అంటూ ఎవరూ లేరని.. ఒకవేళ ఉన్నా చెప్పనని చెప్పేసింది. అనుకుంటాం కానీ.. క్రష్ ఉంటే మాత్రం.. మాకు ఫలానా వాడితో క్రష్ ఉందని ఓపెన్ గా చెప్పేంత పెద్ద మనసు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి మాత్రం ఉంది చెప్పు? సినిమాల్లో బోల్డ్ గా చూపించే ప్రేమాయాణాలు.. తెర వెనుకన ఎన్ని ఉన్నా.. ఏమీ లేనట్లుగా ఉండటం మామూలైనప్పుడు.. క్రష్ ఎవరు లేరు.. ఉన్నా చెప్పనని చెప్పటం సింక్ కావట్లేదు సరికదా.. పెద్దగా ప్రయోజనం కూడా ఉండదన్న విషయం సునయన ఎప్పటికి అర్థం చేసుకుంటుందో?