Begin typing your search above and press return to search.

ఆర్ఆర్ఆర్ ఈవెంట్‌ లో పెళ్లిసందD ఏంటీ?

By:  Tupaki Desk   |   20 March 2022 2:30 PM GMT
ఆర్ఆర్ఆర్ ఈవెంట్‌ లో పెళ్లిసందD ఏంటీ?
X
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ఈనెల 25న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్స్ వరుసగా దేశంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న అంచనాలను ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచేందుకు ఈ ఈవెంట్‌ లను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఈవెంట్‌ లో కూడా హీరోలు ఇద్దరు మరియు రాజమౌళి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

కాని తాజాగా జరిగిన కర్ణాటకలోని చిక్బుల్లాపుర్‌ ఈవెంట్‌ లో మాత్రం పెళ్లిసందD హీరోయిన్ శ్రీలీలా సందడి చేసింది. ఆమె అనూహ్యంగా ఆ ఈవెంట్‌ లో కనిపించడం ఎన్టీఆర్‌ మాట్లాడుతున్న సమయంలో చప్పట్లు కొడుతో ఎంజాయ్ చేస్తున్నట్లుగా విజువల్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. సినిమాకు శ్రీలీలా కు ఏమైనా సంబంధం ఉందా.. సినిమాలో ఆమె ఏమైనా నటించిందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలో ఆమె నటించినట్లుగా ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించలేదు. అలాగే ఆమె కు చిత్ర యూనిట్ సభ్యులకు ఎలాంటి కాంటాక్ట్‌ లేదు. కాని కన్నడ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈవెంట్‌ లో ఒక్క హీరోయిన్‌ కూడా లేకుంటే వెలితిగా ఉంటుంది అనుకున్నారు.. అందుకే ఆమెను కన్నడ డబ్బింగ్ వర్షన్ డిస్ట్రిబ్యూటర్‌ ఈవెంట్‌ కు తీసుకు వచ్చారు అనేది వాదన.

అసలు విషయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. శ్రీలీలా స్టేజ్ పైకి ఎక్కకుండానే జనాల్లో ఉండి అటెన్షన్‌ ను సంపాదించింది అంటే ఆమె అందం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. రాఘవేంద్ర రావు వంటి స్టార్‌ డైరెక్టర్ దృష్టిని ఆకర్షించి ఆయన నిర్మించిన సినిమాలో అవకాశం దక్కించుకుంది అంటేనే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొదటి సినిమా ప్లాప్ అయినా ఫుల్‌ బిజీగా ఉన్న క్రేజీ బ్యూటీ ఈమె.

పెళ్లిసందD సినిమా ప్లాప్‌ తర్వాత ఈమెను జనాలు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మళ్లీ పట్టించుకుంటారా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. కాని అనూహ్యంగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టికి ఎలా అయితే అవకాశాలు వస్తున్నాయో అంతకు మించి అన్నట్లుగా ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. రవితేజ సినిమా మొదలుకుని ఒక బిగ్‌ షాట్ కొడుకు కు జోడీగా నటించే వరకు ఈమె కు చాలా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రేజ్ వల్లే ఈమెను ఆర్‌ఆర్‌ ఆర్‌ ఈవెంట్‌ కు ఆహ్వానించి ఉంటారేమో.