Begin typing your search above and press return to search.

ఆమె నాన్న అంటే బాలయ్య ఒప్పుకుంటాడా?

By:  Tupaki Desk   |   15 Feb 2022 1:30 AM GMT
ఆమె నాన్న అంటే బాలయ్య ఒప్పుకుంటాడా?
X
నందమూరి బాలకృష్ణ జోరు కంటిన్యూ అవుతుంది. గత కొంత కాలంగా సినిమాలు ప్లాప్ అవుతుండటంతో ఆయన కెరీర్‌ ఖతం అయినట్లేనా అనుకుంటూ ఉన్న సమయంలో అనూహ్యంగా అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల వసూళ్లను అఖండ నమోదు చేసింది అంటూ యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఒక వైపు అఖండ మరో వైపు ఆహా లో అన్‌ స్టాపబుల్‌ అంటూ కూడా బాలయ్య సూపర్‌ హిట్ అయ్యాడు.

సక్సెస్ జోరులో ఉన్న బాలయ్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. అఖండ సినిమా విడుదలకు ముందే బాలయ్య రెండు సినిమాలు ఖరారు అయ్యాయి.

తాజాగా గోపీచంద్‌ మలినేని సినిమా షూటింగ్‌ లో బాలయ్య పాల్గొంటున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సమ్మర్ వరకు బాలయ్య.. గోపీచంద్‌ మలినేని కాంబో మూవీ షూటింగ్‌ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గోపీచంద్‌ దర్శకత్వంలో సినిమా పూర్తి అయిన వెంటనే బాలయ్య తన తదుపరి సినిమా ను ఎఫ్‌ 2 మరియు ఎఫ్‌ 3 చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడితో చేయబోతున్న విషయం తెల్సిందే.

ఇప్పటికే వీరిద్దరి కాంబో మూవీ అధికారికంగా ప్రకటన వచ్చింది. వీరిద్దరి కాంబో లో ఒక మాస్ ఎంటర్‌ టైనర్‌ రాబోతుంది అంటున్నారు. ఇప్పటి వరకు అపజయం ఎరుగని అనీల్‌ రావిపూడి ఒక మంచి కమర్షియల్‌ హిట్‌ ను బాలయ్యకు ఇస్తాడని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ మరియు అనీల్‌ రావిపూడి సినిమాకు సంబంధించిన విషయమై ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కథానుసారం హీరో బాలయ్య కు ఇరవై ఏళ్ల కూతురు ఉంటుందట.

సినిమాలో ఇలా వచ్చి అలా పోయేలా కాకుండా మొత్తం సినిమా అంతా కూడా ఆయన కూతురు పాత్ర ట్రావెల్‌ అవుతుందని అంటున్నారు. కనుక ఆ పాత్ర కోసం ఒక ఫేమస్ హీరోయిన్ ను ఎంపిక చేయాలని భావిస్తున్నారట.

తాజాగా బాలయ్య కు కూతురు పాత్రకు గాను కొత్త పెళ్లిసందడి హీరోయిన్‌ శ్రీలీల ను ఎంపిక చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ గా పలు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు ఇలాంటి పాత్రలకు ఒప్పుకునేందుకు ఆసక్తి చూపలేదట. పలువురు ఫిల్మ్‌ మేకర్స్ చెల్లి పాత్రకు ఆమెను సంప్రదించినా కూడా నో చెప్పిందట. కాని బాలయ్య సినిమాలో ఆయనకు కూతురు పాత్ర అనడంతో ఆలోచించకుండా ఓకే చెప్పిందని తెలుస్తోంది.

ఆరు పదుల వయసులో కూడా బాలయ్య ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లుగా వయసును దాచి పెడుతూ పాత్రలు చేస్తూ వస్తున్నాడు. అలాంటి బాలయ్య ఇరవై ఏళ్ల అమ్మాయితో నాన్న అనిపించుకుంటూ నటించేదుకు ఓకే చెప్తాడా అనేది పెద్ద ప్రశ్న.

బాలయ్య ను అనీల్‌ రావిపూడి ఖచ్చితంగా మంచి స్క్రిప్ట్‌ తో మెప్పించి ఉంటాడు. అందుకే ఈ సినిమా లో శ్రీలీల కు బాలయ్య నాన్న గా నటించేందుకు ఒప్పుకుని ఉంటాడు. అంత పెద్ద అమ్మాయితో నాన్న అనిపించుకునేందుకు బాలయ్య ఒప్పుకుంటాడా అనేది అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.