Begin typing your search above and press return to search.
శ్రీలీల ఫుల్ బిజీ.. క్లాష్ కాకుండా తెలివైన ప్లాన్
By: Tupaki Desk | 13 April 2023 8:00 AMపెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీలీల కమర్షియల్ గా పరవాలేదు అనే విధంగా సక్సెస్ అయితే అందుకుంది. అయితే ఆ సినిమా ద్వారా ఆమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆమె ప్రతిభ చిత్రనిర్మాతలను బాగా ఆకర్షించింది. ప్రస్తుతానికి ఆమె అత్యంత బిజీ నటిగా మారిపోయింది. కొత్త ప్రాజెక్ట్ లు ఓకే చేయడానికి కూడా వీలు పడనంత బిజీగా మారిపోయింది.
అయితే ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు కూడా ఆమె చాలా తెలివిగా ఫినిష్ చేసుకుంటోంది. నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా పకడ్బందీగా డేట్స్ క్లాష్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక శ్రీ లీలకి గంటల వారీగా డేట్స్ కేటాయిస్తూ వచ్చారు. ఆమె ఉదయం సెషన్‌లో సినిమా షూట్‌కు హాజరైతే.. ఇక లంచ్ తర్వాత మరో సినిమా షూట్‌కు వెళుతోంది.
24 గంటలూ పని చేస్తున్నప్పటికీ ఆమె మంచి కంటెంట్ ఉన్న పెద్ద సినిమాలు వస్తే ఓకే చేసే పనిలో పడింది. ధమాకా బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ గా నిలిచింది. ఏకంగా 100 కోట్లు వచ్చాయి. ఇక ఆమె వల్లనే ఆ సినిమా హిట్ అయ్యినట్లు టాక్ వస్తోంది. ఇక ఈ ధమాకా నటి ప్రస్తుతం ఎనిమిది సినిమాలకు సంతకం చేసింది.
ఆమె ప్రస్తుతం కనీసం మూడు సినిమాలకు ఒకేసారి చేయడం ప్రారంభించింది. శ్రీ లీల SSMB28తో పాటు పవన్ కళ్యాణ్ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్, వైష్ణవ్ తేజ్ చిత్రం, అలాగే నితిన్ 32, అనగనగా ఒక రాజు సినిమాలు చేస్తోంది. అలాగే ఎన్టీఆర్ 30వ సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
అలాగే శ్రీలీల బోయపాటి శ్రీను తదుపరి చిత్రంలో కూడా నటించడానికి ఒప్పుకుంది. అలాగే NBK108 కోసం కూడా సైన్ ఇన్ చేసింది. శ్రీలీల కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా సైన్ చేయడం ద్వారా తన స్టార్‌డమ్‌ను వృధా చేస్తోందని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ సమయంలో ఆమెకు లాంగ్ రన్ ఇవ్వగల చిత్రాల కోసం ఆమె వేచి ఉంటే బెటర్ అని చాలా మంది భావిస్తున్నారు.