Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ స్టేజ్ పై శ్రీ‌లీల‌ని నాగ్‌ ఏమ‌డిగాడో తెలుసా?

By:  Tupaki Desk   |   19 Dec 2022 3:30 AM GMT
బిగ్ బాస్ స్టేజ్ పై శ్రీ‌లీల‌ని నాగ్‌ ఏమ‌డిగాడో తెలుసా?
X
టాలీవుడ్ హీరోలు చాలా వ‌ర‌కు హీరోయిన్ ల కొర‌త‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ విష‌యంలో స్టార్ హీరోల‌కంటే సీనియ‌ర్ హీరోలే ఎక్కువ‌గా హీరోయిన్ ల విష‌యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌. కింగ్ నాగార్జున‌, విక్ట‌రీ వెంట‌కేష్ వంటి సీనియ‌ర్ హీరోలు ఏదైనా సినిమా చేయాలంటే స్క్రిప్ట్ కంటే ఎక్కుగా హీరోయిన్ కోసం ఆలోచలో ప‌డుతున్నారు. దీంతో యంగ్ హీరోయిన్ ల వెంట ప‌డ‌తున్నారు.

వ‌య‌సుతో సంబంధం లేకుండా త‌మ‌కంటే పాత‌కేళ్లు చిన్న‌వాళ్లైనా స‌రే ఓకే అనేస్తున్నారు. మేక‌ర్స్ కూడా సీనియ‌ర్ హీరోల కోసం హీరోయిన్ ల‌కు కోట్లు ఇవ్వ‌డానికి కూడా వెనుకాడ‌టం లేదు. `అఖండ‌` టైమ్ లో హీరోయిన్ విష‌యంలో ఇబ్బందులు ఎదుర్కొన్న బాల‌య్య మ‌ళ్లీ అలాంటి రిస్క్ ని `వీర సింహారెడ్డి` విష‌యంలోనూ ఫేస్ చేయ‌డం.. ఫైన‌ల్ గా శృతిహాస‌న్ ని రంగంలోకి దించేయ‌డం తెలిసిందే. గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కోసం శృతిహాస‌న్ కు మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీగానే పారితోషికాన్ని బాల‌య్య కోసం అందిస్తున్నారు.

ఇక ఇదే త‌ర‌హాలో సీనియ‌ర్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి కూడా హీరోయిన్ విష‌యంలో ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే కాజ‌ల్ అగ‌ర్వాల్ లేదంటే న‌య‌నతార‌ల‌నే న‌మ్ముకుంటున్న చిరు ఈ సారి `వాల్తేరు వీర‌య్య‌` కోసం శృతిహాస‌న్ ని తీసుకోవ‌డం.. ఇందు కోసం మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ స్థాయిలో పారితోషికాన్ని అందించ‌డం తెలిసిందే. బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని 2023 జ‌న‌వరి 13న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ స్టార్ ల త‌ర‌హాలోనే మ‌రో సీనియ‌ర్ హీరో కింగ్ నాగార్జున కూడా హీరోయిన్ విష‌యంలో ఇబ్బంది ప‌డుతున్నారు. `ది ఘోస్ట్` మూవీ కోసం నాగ్ .. సోనాల్ చౌహాన్ ని ఎంపిక చేసుకోవాల్సి వ‌చ్చింది. అయితే త‌న‌కు కూడా చిరు , బాల‌య్య‌ల త‌ర‌హాలోనే యంగ్ హీరోయిన్ కావాల‌ట‌. త్వ‌ర‌లో 100వ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్న నాగార్జున బిగ్ బాస్ ఫినాలే స్టేజ్ సాక్షిగా నాతో శ్రీ‌లీల ఎప్పుడు న‌టిస్తుంద‌ని నాగార్జున ఓపెన్ గా అడిగేయ‌డం అక్క‌డున్న వారిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

ఆదివారం జ‌రిగిన బిగ్ బాస్ ఫినాలేకి ర‌వితేజ‌, శ్రీ‌లీల గెస్ట్ లుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌లీల పై డ్యాన్స్ పై ప్ర‌శంస‌లు కురిపించిన నాగార్జున త‌న‌తో శ్రీ‌లీల ఎప్పుడు న‌టిస్తుంద‌ని ర‌వితేజ‌ని అడ‌గడాన్ని బ‌ట్టి త‌న‌కూ వంద‌వ సినిమాలో యంగ్ హీరోయినే కావాల‌ని ఇండైరెక్ట్ గా నాగ్ హింట్ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇక త్వ‌ర‌లో కొత్త సినిమా ప్ర‌క‌టించ‌బోతున్న విక్ట‌రీ వెంక‌టేష్ కూడా త‌న‌కూ యంగ్ హీరోయినే కావాలంటాడేమో చూడాలి.

పూజా హుగ్డే కోసం చిరంజీవి `ఆచార్య‌` ప్రెస్ మీట్ లో ఆప‌సోపాలు ప‌డ‌టం ఆ త‌రువాత `వాల్తేరు వీర‌య్య‌` కోసం ఏకంగా యంగ్ హీరోయ‌న్ శృతిహాస‌న్ ని కోరుకోవ‌డం.. త‌న లాగే నంద‌మూరి బాల‌కృష్ణ `వీర సింహారెడ్డి` కోం అదే శృతిహాస‌న్ ని హీరోయిన్ గా ఎంచు కోవ‌డం తెలిసిందే.