Begin typing your search above and press return to search.

కమిట్‌ మెంట్‌ ఇవ్వాలని అగ్రిమెంట్‌ లో రాస్తున్నారు!

By:  Tupaki Desk   |   6 Sep 2019 8:16 AM GMT
కమిట్‌ మెంట్‌ ఇవ్వాలని అగ్రిమెంట్‌ లో రాస్తున్నారు!
X
ఈమద్య కాలంలో కాస్టింగ్‌ కౌచ్‌ గురించి సోషల్‌ మీడియాలో ఎంతో మంది నటీమణులు నిర్మొహమాటంగా మాట్లాడుతున్నారు. తమకు జరిగిన అన్యాయంను చెప్పుకుంటూ.. ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితిని వివరిస్తున్నారు. అందరు అలా కాదంటూనే కొందరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా నటి శిరీష ఇండస్ట్రీలోని కొందరిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. పక్కలో పడుకుంటేనే అవకాశాలు ఇస్తున్నారు. బయట ఇంత ప్రచారం జరుగుతున్నా పక్కలో పడుకున్న తర్వాతే అవకాశాలు ఇస్తున్న వారు ఇండస్ట్రీలో ఇంకా చాలా మందే ఉన్నారు. మరి కొందరు పడుకున్న తర్వాత కూడా అవకాశాలు ఇవ్వకుండా మొహం చాటేయడం.. ఫోన్‌ లు ఎత్తకుండా ఉండటం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

దర్శకుడు రవిబాబు తన కెరీర్‌ ను నాశనం చేశాడంటూ ఆరోపించింది. రవిబాబు పేరుతో ఉన్న అకౌంట్‌ నుండి తనకు వచ్చిన మెసేజ్‌ లను ఆమె చూపించింది. అవి రవిబాబు పంపించాడా లేదా మరెవ్వరైనాన అనే విషయంపై యాంకర్‌ అనుమానం వ్యక్తం చేయగా ఆయన అకౌంట్‌ ఆయన నెంబర్‌ ఉంటుందని చెప్పుకొచ్చింది. అందులో చాట్‌ చేసిన వ్యక్తి నీ రేటు ఎంత.. వస్తావా అంటూ అసభ్యంగా మెసేజ్‌ లు చేశాడు. ఇంకా చాలా మంది కమిట్‌ మెంట్‌ తీసుకుని కూడా నాకు ఛాన్స్‌ లు ఇవ్వకుండా వదిలేశారు. ఛాన్స్‌ ఉంది రమ్మని అక్కడకు వెళ్లిన తర్వాత లేదంటూ చెప్పడం కూడా నాకు ఎదురైన చేదు సంఘటనల్లో ఒకటి. 50 సినిమాలకు పైగా చేసిన నేను ఇప్పుడు ఎందుకు నచ్చడం లేదు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న నన్ను ఆదుకోమంటే ఎందుకు ఆదుకోవడం లేదని శిరీష ప్రశ్నించింది.

సభ్యతం కోసం ప్రయత్నిస్తున్నా కూడా ఎవరు స్పందించడం లేదు. మా లో సభ్యత్వం కావాలంటే పెద్ద రికమండేషన్‌ తో వెళ్లాల్సి ఉంటుందని ఆమె ఆరోపించింది. తనకు జరిగిన అన్యాయంను చెప్పుకునేందుకు జీవిత గారిని కలిసేందుకు ప్రయత్నించాను. కాని ఆమె ఫోన్‌ రిసీవ్‌ చేయడం లేదు. ఇక మా అధ్యక్షుడు నరేష్‌ గారు వారి తల్లి గారు చనిపోవడంతో ఈ విషయాలను గురించి పట్టించుకోకుండా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానని నాకు అవకాశాలు రాకుంటే మాత్రం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆత్మహత్య నిర్ణయంను వెనక్కు తీసుకోవాల్సిందిగా యాంకర్‌ కోరిన సమయంలో తాను మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఇలాంటి సమయంలో ఇంత కష్టాల్లో బతకాలనిపించడం లేదంది.

సినిమాలో నటించేందుకు అగ్రిమెంట్‌ రాస్తూ ఉంటారు. ఆ సమయంలోనే వారు కమిట్‌ మెంట్‌ ఇవ్వాల్సి ఉంటుందని అంటారు. కొందరు అయితే ఏకంగా కమిట్‌ మెంట్‌ విషయాన్ని అగ్రిమెంట్‌ లో కూడా రాస్తున్నారు. నా స్నేహితులు కొందరు కమిట్‌ మెంట్‌ కు ఒప్పుకుని అగ్రిమెంట్‌ ఇచ్చిన సందర్బాలు కూడా ఉన్నాయి. గతంలో నేను కూడా కమిట్‌ మెంట్‌ కు ఓకే చెప్తు అగ్రిమెంట్‌ ఇవ్వాల్సి వచ్చిందని శిరీష పేర్కొంది. ఇండస్ట్రీలో ఒకప్పుడు దేవతలు దేవుళ్లు ఉండేవారు. కాని ఇప్పుడు అంతా దెయ్యాలు మాత్రమే ఉన్నాయని శిరీష ఆరోపించింది.