Begin typing your search above and press return to search.

మాజీ హీరోయిన్ స్లిమ్ అవుతోంది.. ఏంటి కథ?

By:  Tupaki Desk   |   27 Nov 2017 1:15 PM GMT
మాజీ హీరోయిన్ స్లిమ్ అవుతోంది.. ఏంటి కథ?
X
గత కొంత కాలం నుండి సౌత్ సినీ ఇండస్ట్రీలలో హీరోలకంటే ఎక్కువగా ఎంతో మంది హీరోయిన్స్ వస్తున్నారు వెళ్లిపోతున్నారు. అయితే వారిలో కొంతమందిని ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేము. సిల్వర్ స్క్రీన్ ఒకప్పుడు ఎంతో అందంగా కనిపించి.. సడన్ గా డి గ్లామర్ లో వేరే స్టైల్ లో కనిపిస్తే ఆమెను గుర్తించడం కొంచెం కష్టమే. కానీ కొంతమంది హీరోయిన్స్ ఎంత పెద్దవారైన చూసి ఎన్ని రోజులైనా చూడగానే చెప్పవచ్చు. అలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో సిమ్రాన్ ఒకరు.

అమ్మడి స్టార్ ఇమేజ్ ఒకప్పుడు ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలనైన తనదైన శైలిలో చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే వారు. అలాగే టాలీవుడ్ లో సౌత్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరితో సిమ్రాన్ ఒకటిగా పైగానే సినిమాలని చేసింది. సిమ్రాన్ అందాల కోసమే అప్పట్లో కుర్రకారు సినిమాలకు వెళ్లేవారు. అలాంటి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సిమ్రాన్ మెల్లమెల్లగా గ్లామర్ ని కూడా తగ్గించేసి స్పెషల్ పాత్రలనే చేసింది. కొన్ని సీరియల్స్ లో కూడా నటించేసింది.

అయితే రీసెంట్ గా సిమ్రాన్ ఎవరు ఊహించని విధంగా కనిపించి షాక్ ఇచ్చింది. నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టిన సిమ్రాన్ ఇటీవల బ్లాక్ గ్లామర్ డ్రెస్ లో కనిపించి మళ్లీ యువ సిమ్రాన్ లెవెల్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెటీజన్స్ ని చాలా ఆకర్షిస్తున్నాయి. సిమ్రాన్ ఈజ్ బ్యాక్ అని టైటిల్స్ కూడా ఇస్తున్నారు. చూస్తుంటే చాలా స్లిమ్ గా అయినట్టు కూడా కనిపిస్తోంది. దీంతో స్పెషల్ పాత్రలు కాకుండా ఇంకేమైనా ప్రయోగాత్మకమైన పాత్రలను చేస్తోందా లేక నార్మల్ గా అందాన్ని ఇలా మెయింటైన్ చేస్తోందా? వెయిట్ అండ్ సి.