Begin typing your search above and press return to search.

'బ‌ద్రి' కి 20 ఏళ్లు ..షాకిచ్చే సీక్రెట్ చెప్పిన రేణు

By:  Tupaki Desk   |   20 April 2020 9:10 AM GMT
బ‌ద్రి కి 20 ఏళ్లు ..షాకిచ్చే సీక్రెట్ చెప్పిన రేణు
X
ఎన్ని సినిమాల్లో న‌టించినా తొలి సినిమా జ్ఞాప‌కం వేరు. ఆ తీపి జ్ఞాప‌కం అలా స్మృతుల్లో నిలిచిపోతుంది. ఆ సినిమా స‌మ‌యంలో క‌ష్టం వ‌చ్చినా.. లేదా సంతోషం క‌లిగే విష‌యం ఎదురైనా అవ‌న్నీ రికార్డెడ్ గా ఉండిపోతాయి. అలా త‌న కెరీర్ తొలి సినిమా బ‌ద్రి గురించి గుర్తు చేసుకుని నేడు ఆ చిత్ర క‌థానాయిక రేణు దేశాయ్ ఎంతో ఎమోష‌న్ అయ్యారు. బ‌ద్రి సినిమా విడుదలై నేటికి సరిగ్గా 20ఏళ్ళు పూర్త‌యింది. 2000 ఏప్రిల్ 20న విడుదలైన ఈ మూవీ రేణుకి డెబ్యూ సినిమా. ఈ చిత్రంతోనే పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించారు. తొలి ప్ర‌య‌త్న‌మే పూరీకి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం ద‌క్కింది. రేణు గోల్డెన్ లెగ్ గా పాపుల‌రైంది.

అందుకే ఆ సినిమాని రేణు ఎప్ప‌టికి మ‌ర్చిపోలేదు. ఇక ఈ మూవీ స‌మ‌యంలోనే రేణు .. ప‌వ‌న్ ప్రేమ‌లో ప‌డి అటుపై వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. రెండు ద‌శాబ్ధాల బ‌ద్రి ని గుర్తు చేసుకుని ఆ సినిమా సెట్స్ లో త‌న‌కు ఎదురైన ఓ ఇబ్బందిని రేణు గుర్తు చేసుకుంది. అస‌లు న‌గ‌రంతో సంబంధం లేకుండా క‌మ్యూనికేష‌న్ లేనిచోట ఈ మూవీ షూటింగులో పాల్గొనాల్సి వ‌చ్చింద‌ట‌. అయితే అక్క‌డ షూట్ గ్యాప్ లో కూచునేందుకు క‌నీసం కుర్చీ స‌దుపాయం అయినా లేద‌ట‌. దాంతో ప‌వ‌న్ పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న బండపై పడుకోగా.. రేణు ఓ అసౌక‌ర్యం వ‌ల్ల అలానే గంట‌ల కొద్దీ స‌మ‌యం నిలుచుండిపోవాల్సి వ‌చ్చింద‌ట‌. త‌ను వేసుకున్న‌ షార్ట్ స్కర్ట్ ఇబ్బంది పెట్ట‌డంతో కూచోలేక‌పోయింద‌ట‌. ఆ సంగ‌తినే గుర్తు చేసుకుంటే నాటి ఫోటోని షేర్ చేసుకుంది. నేల‌పై కూచోలేను అలాగ‌ని నించోలేను! అంటూ కాస్త ఆవేద‌న చెందింది. బద్రి లో సూపర్ హిట్ సాంగ్ బంగాళా ఖాతంలో.. సాంగ్ షూట్ సమయంలో తీసిన ఫోటో అది.

ప్ర‌స్తుతం రేణు దేశాయ్ హైద‌రాబాద్ లో నే నివాసం ఉంటున్నార‌ని తెలుస్తోంది. ఇక త‌న వార‌సులు అకీరా నంద‌న్.. ఆద్యల కెరీర్ ప‌రిశ్ర‌మ‌లోనే సాగ‌నుంద‌ని రేణు ఇప్ప‌టికే క్లారిటీనిచ్చారు. అకీరాను పెద్ద హీరోను చేయాల‌న్న ప్ర‌ణాళిక రేణు వ‌ద్ద ఉంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల టీవీ రియాలిటీ షోల‌కు జ‌డ్జిగా కొన‌సాగుతున్న రేణు మునుముందు నిర్మాత‌గానూ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌ట‌. ఇక రేణు నుంచి విడిపోయినా వార‌సుల విష‌యంలో ప‌వ‌న్ నుంచి అన్నిర‌కాలుగా త‌న‌కు స‌పోర్ట్ ఉన్న సంగ‌తి తెలిసిందే.