Begin typing your search above and press return to search.

అజిత్‌ బావ వద్దన్నాడు అంటున్న హీరోయిన్‌

By:  Tupaki Desk   |   7 Sep 2015 7:55 AM GMT
అజిత్‌ బావ వద్దన్నాడు అంటున్న హీరోయిన్‌
X
జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి, అంజ‌లి చిత్రాల‌తో తెలుగు వారి మ‌న‌సు దోచిన బేబి షామిలీ ఆ త‌ర్వాత సిద్ధార్థ్ స‌ర‌స‌న ఓయ్ చిత్రంతో క‌థానాయిక‌గా తెరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా త‌ర్వాత అనూహ్యంగా బ్రేక్ తీసుకుని సింగ‌పూర్ వెళ్లిపోయింది. విదేశాల్లో చ‌దువుకునేందుకు అవ‌కాశం వ‌చ్చింది. మూడేళ్ల పాటు అక్క‌డే విద్యాభ్యాసం చేయాల్సొచ్చింది. అందుకే సినిమాల‌కు బ్రేక్ నిచ్చాను. .. అని షామిలి చెబుతోంది.

ప్ర‌స్తుతం ఈ భామ విక్ర‌మ్ ప్ర‌భు స‌ర‌స‌న వీర్ శివాజీ, ధ‌నుష్ స‌ర‌స‌న ఓ సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాల‌తో కోలీవుడ్‌ లో ఎంట్రీ ఇస్తున్న ఈ భామ త్వ‌ర‌లోనే తెలుగులోనూ న‌టించ‌డానికి రెడీ అవుతోంద‌ని తెలుస్తోంది. బ్రేక్ తీసుకుని చ‌దువు పూర్తి చేశా. నేను న‌టిస్తానంటే బావ‌గారు అజిత్ (షాలిని భ‌ర్త‌) పూర్తి స‌పోర్టివ్‌ గా నిలిచారు. నా ఫోటోషూట్ కోసం ఆయ‌నే ఎరేంజ్ చేశారు. అంత స‌పోర్టివ్‌. వాస్త‌వానికి సినిమాల్లో ఎందుకు? ముందు చ‌దువుకో అని ప్రోత్స‌హించారు. ఇప్పుడు వ‌రుస‌గా ఛాన్సులొస్తుంటే నాకు స‌పోర్ట్‌ గా నిలిచారు బావ‌గారు... అని చెప్పింది.

సింగ‌పూర్‌ లో ఉన్న‌ప్పుడు ఒంట‌రిగానే ఉన్నా. అక్క‌డ రూమ్ తీసుకుని స్వ‌యంగా వండుకు తిన్నా. మూడేళ్ల పాటు అక్క‌డే అలా గ‌డిపేయ‌డం ఎంతో ఫ‌న్నీగా అనిపించింది. చ‌దువు పూర్త‌యింది. మ‌ళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నా. అక్క షామిలీ, బావ అజిత్ నా వెంటే ఉన్నారు అని చెప్పింది. ప్రస్తుతం ఓ మోడ్ర‌న్ గాళ్ పాత్రల్లో న‌టించ‌డానికి సిద్ధ‌మే. అలాగ‌ని స్కిన్‌ షో చేయాలంటే నా వ‌ల్ల కాదు.. అని షామిలి చెప్పింది. ప్ర‌స్తుతం ధ‌నుష్ స‌ర‌స‌న పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌ లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నా. వీర్ శివాజీ ఓ రొమాంటిక్ కామెడీ.. ఈ రెండిటిలో నేను అంద‌రికీ న‌చ్చుతా అని చెప్పింది షామిలి.