Begin typing your search above and press return to search.

బికినీ బీచ్ లో షామా బంచిక్ బమ్ పార్టీ

By:  Tupaki Desk   |   6 Aug 2022 4:30 AM GMT
బికినీ బీచ్ లో షామా బంచిక్ బమ్ పార్టీ
X
న‌టి గాయ‌ని మోడ‌ల్ షామా సికిందర్ స్పెష‌ల్ బీచ్ పార్టీల గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. వాట‌ర్ బేబీగా ఇప్ప‌టికే బోలెడంత పాపులారిటీ సంపాదించిన ఈ బ్యూటీ నిరంత‌రం త‌న బీచ్ వెకేష‌న్ల‌ను కొన‌సాగిస్తోంది. 05 ఆగ‌స్టు షామా పుట్టినరోజు సంద‌ర్భంగా మ‌రోసారి బీచ్ పార్టీలో చెల‌రేగింది. గ్రీస్ దేశంలోని విశాల‌మైన బీచ్ లో ఒక ఫుల్ డే అంతా పార్టీలో మునిగి తేలింది. త‌న లైఫ్ లో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని స్పెష‌ల్ బ‌ర్త్ డే పార్టీ ఇది అంటూ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది.

షామా సికిందర్ ఆరెంజ్ బికినీ ధరించి చేతిలో పానీయం పట్టుకుని క‌నిపిస్తున్న ఫోటోలు ఇప్పుడు వెబ్ లో దుమారం రేపుతున్నాయి. ఈ ఫోటోల‌కు షామా అద్భుత‌మైన‌ క్యాప్షన్ ఇచ్చింది. ``బాగా (ఆనందంగా) గడిపిన పుట్టినరోజు...`` అని వ్యాఖ్యానించింది. షామా త‌న భర్త గ్రీస్ లోని మైకోనోస్ లో ఉన్నప్ప‌టి బీచ్ ఫోటోషూట్ ఇది.

అంతేకాదు.. ర‌క‌ర‌కాల బీచ్ ల‌లో షామా పార్టీల‌కు సంబంధించిన గుట్టు కూడా లీకైంది. ఇంత‌కుముందు బ్యాంకాక్ లోని పింక్ బికినీలో పూల్ సైడ్ ట్రీట్ లో చెల‌రేగిన షామా ఇలా దానికి క్యాప్ష‌న్ ఇచ్చింది. ``నాకు వయసు పెరగడం లేదు.. ఇంకా మెరుగ‌వుతున్నా! బాగా జీవించిన .... బాగా గడిపిన జీవితం.... దానికి కృతజ్ఞతలు. మునుముందు జీవితంలో ప్ర‌వేశించే వాటి పట్ల ఉత్సాహం... ఓహ్ జీవితం అంటే ఇదే. మీరు నాలో ప్రేమను పుష్క‌లంగా నింపుతున్నారు!`` అంటూ ఎంతో ఎమోష‌న‌ల్ గా సుదీర్ఘ నోట్ ని రాసింది.

బోల్డ్ షోతో అలా పాపుల‌రైంది!

షామా సికింద‌ర్‌.. బోల్డ్ అండ్ వండ‌ర్ బ్యూటీ.. సినిమాల్లో పెద్ద‌గా న‌టించ‌క‌పోయినా.. టీవీ షోస్‌.. వెబ్ డ్రామాల‌తో ఫేమ‌స్ అయింది. ల‌స్ట్ స్టోరీస్ తో బాగా పాపుల‌ర్ అయిన ఈ బ్యూటీ ఫ‌ర్దీన్‌ఖాన్ న‌టించిన `ప్రేమ్ అగ్గ‌న్‌` మూవీతో బాలీవుడ్ లో కెరీర్ ని స్టార్ట్ చేసింది. షామా ఆ త‌రువాత బైపాస్ రోడ్ వ‌ర‌కు డ‌జ‌ను పైగా సినిమాల్లో న‌టించింది. కానీ ఆమెకి పెద్ద‌గా గుర్తింపు ద‌క్క‌లేదు. దీంతో త‌న పంథాను మార్చుకుని వెబ్ సిరీస్ లు .. ప్రైవేట్ ఆల్బ‌మ్స్ లో న‌టించ‌డం మొద‌లుపెట్టింది.

ఆ త‌రువాత కియారా అద్వానీ `ల‌స్ట్ స్టోరీస్‌` త‌ర‌హాలో `సెక్స్ హోలిక్స్` అనే షార్ట్ ఫిల్మ్ లో న‌టించి ఒక్క‌సారిగా షామా పాపుల‌ర్ అయింది. ఇందులో హాట్ హాట్ బెడ్ రూమ్ స‌న్నివేశాల్లో రెచ్చిపోయిన న‌టించి కుర్ర‌కారుకి కునుకు లేకుండా చేసింది. ఇప్ప‌టికీ సినిమాల్లో అవ‌కాశాలు లేక‌పోయినా ష‌మా క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు.

ప్రైవేట్ ఆల్బ‌మ్స్ తో ర‌చ్చ చేస్తూ ఇన్ స్టాని హీటెక్కిస్తోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా అందాల విందు చేస్తూ నెటిజ‌న్స్ కి కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజా బికినీ బీచ్ పార్టీలో త‌న వ‌యసు త‌గ్గింద‌ని సెల‌విచ్చింది. అయినా కానీ.. వ‌య‌సు పెర‌గ‌కుండా షామా అమృతం తాగిందా? కొంప‌దీసి ఇంద్ర‌లోకానికి క‌నెక్ట్ అయ్యి ఉందా? అన్న‌ది త‌నే చెప్పాలి.