Begin typing your search above and press return to search.

ఆ బయోపిక్ కొంప ముంచుతుందా ?

By:  Tupaki Desk   |   18 May 2019 4:25 AM GMT
ఆ బయోపిక్ కొంప ముంచుతుందా ?
X
ఇప్పుడంటే ఈ తరానికి శృంగార తార షకీలా అంటే ఎవరో తెలియకపోవచ్చు కానీ ఓ ఇరవై ఏళ్ళు వెనక్కు ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లి అప్పుడు యువకులుగా ఉన్న సినిమా ప్రేమికులను కదిలిస్తే వాళ్ళు కథలు కథలుగా చెబుతారు. మలయాళం బాక్స్ ఆఫీస్ నే కాదు డబ్బింగ్ మూవీస్ తో పక్క రాష్ట్రాల్లోనూ వసూళ్ల ప్రభంజనం సృష్టించిన ఈ పార్న్ స్టార్ గురించి అప్పట్లో తెలియని వారు లేరు.

ఇప్పుడు ఈవిడ బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. రిచా చద్ద టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చే స్టేజి లో ఉంది. హిందీతో పాటు సౌత్ లోని అన్ని భాషల్లోకి డబ్బింగ్ కానున్న షకీలా బయోపిక్ గతంలో వచ్చిన సిల్క్ స్మిత ది డర్టీ పిక్చర్ ని మించిన సెన్సేషన్ అవుతుందనని మేకర్స్ ధీమాగా ఉన్నారు

ఇదిలా ఉండగా తన కెరీర్ ని నాశనం చేయాలనీ చూసిన ప్రతి ఒక్కరిని చిన్నా పెద్దా తేడా లేకుండా ఇందులో చూపించబోతున్నారని షకీలా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆవిడ హవా నడుస్తున్న టైంలో కేరళ స్టార్ హీరోలు కొందరు తనను అణిచివేయాలని చూసిన మాట వాస్తవమే. దీని మీద అప్పటి మీడియాలో చాలా కథనాలు వచ్చాయి.

వాటినే ఉటంకించేలా ఇందులో నిజాలు చూపించబోతున్నట్టు చెప్పింది. అయితే ఓపెన్ గా పేర్లతో సహా చూపిస్తారా లేక ఇన్ డైరెక్ట్ గా ప్రేక్షకులు గుర్తించేలా క్లూ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇప్పటిదాకా పెద్దగా బజ్ లేని షకీలా బయోపిక్ కు ఈ స్టేట్ మెంట్ తో కొత్త ఉత్సాహం వచ్చేలా ఉంది