Begin typing your search above and press return to search.

వేరొక‌రితో షేరింగుకి స్టార్ హీరోయిన్ స‌సేమిరా?

By:  Tupaki Desk   |   8 Jun 2022 5:30 PM GMT
వేరొక‌రితో షేరింగుకి స్టార్ హీరోయిన్ స‌సేమిరా?
X
ఇటీవ‌లి కాలంలో ఒకే సినిమాలో ముగ్గురు న‌లుగురు హీరోయిన్లతో హీరో రొమాన్స్ చేయ‌డం చూస్తున్న‌దే. ముక్కోణ‌పు ప్రేమ‌క‌థా చిత్రాల్లో హీరోగారు ఇద్ద‌రు హీరోయిన్ల‌తో త‌ప్ప‌నిస‌రిగా రొమాన్స్ చేయాల్సి ఉంటుంది. క‌థ‌ను బ‌ట్టి ఎంపిక ఉంటుంది.

కానీ ఇటీవల ఓ ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ ని ఇండ‌స్ట్రీలో రైజింగులో ఉన్న‌ వేరొక యువ‌ హీరోయిన్ తో క‌లిసి ఒక వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో న‌టించాలని కోర‌గా స‌సేమిరా అనేసింద‌ట‌. తొలుత అంగీక‌రించినా కానీ వేరొక హీరోయిన్ తో క‌లిసి చేయ‌లేను అనేసింద‌ట‌. కార‌ణం ఏదైనా కానీ ఇది టాలీవుడ్ ఫిలిం స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

వేరొక హీరోయిన్ తో క‌లిసి తాను న‌టించ‌లేనని ఖ‌రాకండిగా తెగేసి చెప్పేయ‌డానికి కార‌ణం ఏమై ఉంటుంది? అంటూ ఆరాలు తీస్తున్నారు. నిజానికి ఈ ప్ర‌క‌ట‌న‌కు ముందే స‌ద‌రు హీరోయిన్ వేరొక ప్ర‌ముఖ హీరోయిన్ తో క‌లిసి ఓ ముక్కోణ ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టించింది. ప్రియురాళ్ల‌ను మ్యానేజ్ చేయ‌లేక తంటాలు ప‌డేవాడిగా ఈ చిత్రంలో స‌ద‌రు హీరో గారు న‌టించారు.

అయితే అప్పుడు కుదిరిన కంఫ‌ర్ట్ ఇప్పుడే ఎందుక‌ని కుద‌ర‌డం లేదు? అన్న ప్ర‌శ్న ఎదురైంది. నిజానికి ఇత‌ర అగ్ర హీరోయిన్ తో క‌లిసి న‌టిస్తే ప్రేక్ష‌కులు త‌న‌తో పోలిక‌లు చూడ‌డం స‌హ‌జం. అది త‌న‌కు న‌చ్చ‌డం లేద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

తాను ఏ సినిమాలో న‌టించినా త‌న‌కే పేరు రావాల‌ని కూడా స‌ద‌రు హీరోయిన్ కోరుకుంటోంద‌ట‌. ఇటీవ‌ల పాన్ ఇండియా స్టార్ గానూ వెలిగిపోతున్న ఈ బ్యూటీ ప్ర‌స్తుతం క్ష‌ణం తీరిక లేని షెడ్యూళ్ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది.

ఇటు తెలుగు అటు హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ల్లో బిజీ అయిపోయింది. మ‌రోవైపు హాలీవుడ్ లోనూ ఓ మూవీలో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న అగ్ర క‌థానాయిక‌ల్లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న స‌ద‌రు బ్యూటీ హ‌ద్దులు చెరిపేసే గ్లామ‌ర్ షోకి కూడా రెడీ అవుతుండ‌డం హాట్ టాపిక్ గా మారుతోంది.