Begin typing your search above and press return to search.

అఖిల్ హీరోయిన్ స్టార్ మెటీరియల్

By:  Tupaki Desk   |   22 Sep 2016 6:54 AM GMT
అఖిల్ హీరోయిన్ స్టార్ మెటీరియల్
X
టాలీవుడ్ హిట్ మూవీ జయం చిత్రాన్ని తమిళ్ లో అదే పేరుతో రీమేక్ చేసి.. జయం రవిగా సెటిల్ అయిపోయాడు రవి. ప్రస్తుతం ఈ కుర్రాడికి దాదాపు స్టార్ హీరో ఇమేజ్ ఉందనే విషయం తెలిసిందే. స్క్రిప్ట్ ల ఎంపిక విషయంలో ఇతగాడి టేస్ట్ కి కోలీవుడ్ జనాలు మెస్మరైజ్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న ధృవ చిత్రానికి మాతృక అయిన తనీ ఒరువన్.. జయం రవి చిత్రమే.

ప్రస్తుతం లక్ష్మణ్ దర్శకత్వంలో బోగన్ షూటింగ్ ను పూర్తి చేసిన జయం రవి.. తన నెక్ట్స్ ప్రాజెక్టును స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. విజయ్ దర్శకత్వంలో చేయనుండగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా అఖిల్ భామ సాయేషా సైగల్ నటిస్తోంది. 'సాయేషా సైగల్ ఇప్పటికే స్టార్ మెటీరియల్ అంతే. తన తమిళ్ మాట్లాడుతుంటే.. ఇక్కడి వాళ్లు మాట్లాడుతున్నంత స్పష్టంగా ఉంటుంది. ఫ్యూచర్ లో తను ఖచ్చితంగా చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది' అంటున్నాడు జయం రవి.

చెన్నై.. థాయ్ ల్యాండ్.. అండమాన్ దీవుల్లో ఈ చిత్ర షూటింగ్ ప్లాన్ చేయగా.. ఈ సబ్జెక్ట్ ని ఇప్పటివరకూ ఏ దర్శకుడు టచ్ చేయలేదు అంటున్నాడు హీరో. 'మనిషిగా ఎవరు బెటర్' అనే ట్యాగ్ లైన్ తగిలించాలని అనకుంటున్నామని.. హ్యూమన్ ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఫిలిం అంటున్నాడు జయం రవి.