Begin typing your search above and press return to search.

ఆర్య - సాహేషాల పెళ్లిలో మనోళ్లు లేరేం?

By:  Tupaki Desk   |   9 March 2019 4:43 PM GMT
ఆర్య - సాహేషాల పెళ్లిలో మనోళ్లు లేరేం?
X
తమిళ స్టార్‌ హీరో ఆర్య మరియు బాలీవుడ్‌ స్టార్‌ ఫ్యామిలీ వారసురాలు - హీరోయిన్‌ సాహేషా సైగల్‌ ల వివాహం నేడు - రేపు హైదరాబాద్‌ లో గ్రాండ్‌ గా జరుగుతున్న విషయం తెల్సిందే. పెళ్లికి ముందు జరిగే సంగీత్‌ కార్యక్రమంలో బాలీవుడ్‌ స్టార్స్‌ పలువురు పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ పాల్గొని డాన్స్‌ చేయడంతో కార్యక్రమం మరింతగా వైభవంగా జరిగింది. ఈవివాహ వేడుక హైదరాబాద్‌ లోని ఒక ప్రముఖ హోటల్‌ లో జరుగుతుంది.

హైదరాబాద్‌ లో జరిగినా కూడా నిన్న, మొన్న జరిగిక కార్యక్రమాల్లో టాలీవుడ్‌ నుండి ఎవరు పాల్గొనలేదు. నేడు కూడా టాలీవుడ్‌ నుండి గెస్ట్‌ లు ఆర్య పెళ్లికి వెళ్లిన దాఖలాలు లేవు. దాంతో ఆర్య - సాహేషా సైగల్‌ ల వివాహంకు టాలీవుడ్‌ స్టార్స్‌ కు ఎవరికి ఇన్విటేషన్‌ అందలేదని తెలుస్తోంది. పెళ్లిలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు మాత్రం పాల్గొనే అవకాశం ఉంది.

టాలీవుడ్‌ లో సాహేషా 'అఖిల్‌' చిత్రంలో నటించడంతో పాటు - ఆర్య కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే - ఆయనకు ఇండస్ట్రీలో చాలా పరిచయాలు ఉన్నాయి. అయినా కూడా ప్రైవేట్‌ గా పెళ్లి జరగాలనే ఉద్దేశ్యంతో పెద్దగా అతిథులకు కూడా ఆహ్వానించకుండా సైలెంట్‌ గా ఈ స్టార్స్‌ పెళ్లి చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత జరుగబోతున్న రిసెప్షన్‌ కు అయినా మన వారు ఎవరైనా వెళ్తారేమో చూడాలి.