Begin typing your search above and press return to search.
సంయుక్తా మేనన్ పచ్చబొట్టు.. అర్థం ఇదే..!
By: Tupaki Desk | 28 April 2023 12:30 AM ISTటాలీవుడ్ సంచలనం సంయుక్తా మీనన్. ఈ గోల్డెన్ బ్యూటీ వరస ఛాన్స్ లతో దూసుకుపోతోంది. ఆమె నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ కావడంతో, ఆమె గోల్డెన్ గర్ల్ గా మారిపోయింది. సంయుక్త సినిమాలో ఉంటే చాలు సినిమా హిట్ గ్యారెంటీ అనే అభిప్రాయం ఏర్పడింది. అయితే, ఈ బ్యూటీ కూడా కొందరి తారల్లానే టాటూ ట్రెండ్ ఫాలో అయ్యింది. మన టాలీవుడ్ లో ఉన్న చాలా మంది హీరోయిన్లు టాటూ లు వేయించుకున్న విషయం తెలిసిందే. సంయుక్త కూడా తన బ్యాక్ షోల్డర్ పై టాటూ వేయింకుంది. ఆ టాటూ మళయాళంలో ఉండటంతో.. దాని అర్థం ఏంటా అని తెలుసుకోవాలని కుర్రాళ్లు ప్రయత్నిస్తున్నారు.
కాగా, ఇటీవల సంయుక్త స్వయంగా తన టాటూకి అర్థం వివరించింది. దాని అర్థం ‘సంచారి’ అని చెప్పింది. రెండేళ్ల క్రితమే తాను ఆ టాటూ వేయించుకున్నట్లు ఆమె చెప్పడం విశేషం. సంచారి అంటే ప్రయాణికుడు అని అర్థం. ఆమెకు ఒంటరిగా ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. తనకు డల్ గా అనిపించినప్పుడు, అసంతృప్తిగా అనిపించినప్పుడు, ఒంటరిగా ప్రయాణాలు చేయడాన్ని ఇష్టపడుతుందట. అందుకే ఆమె ఆ టాటూ వేయించుకుందట.
తెలుగులో రాకముందు సంయుక్త మీనన్ మళయాళంలో చాలా సినిమాల్లో చేసింది. అయితే, పెద్దగా అనుకున్న సక్సెస్ రాలేదు. ఆ తర్వాతే ఆమె ఒంటరిగా 8 రోజులు విహారయాత్రకు వెళ్లింది. ఆధ్యాత్మిక యాత్ర చేసిన తర్వాతే ఆమెకు టాలీవుడ్ నుంచి వరస ఆఫర్లు చుట్టుముట్టాయి. అందుకే ఆమె ఒంటరిగా యాత్రలను చేయడాన్ని ఇష్టపడుతుందట. మొదటి నుంచి ప్రయాణాలు చేయడం ఇష్టం కాబట్టే, ఆ టాటూని వేయించుకోవడం విశేషం.
బీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన సంయుక్త మీనన్., ఆ తర్వాత వరస ఆఫర్లు చేజిక్కించుంది. ఆమె నటించిన బింబిసార, సార్ సినిమాలు కూడా హిట్ అయ్యింది. ఇక ఇటీవల వచ్చిన విరూపాక్షలో అయితే ఆమె విశ్వరూపం చూపించేసింది. నందిని పాత్రలో జీవించేసింది. హీరోయిన్ అంటే కేవలం సాంగ్స్ , రొమాన్స్ మాత్రమే కాదు, నటన పరంగా కూడా తాను సత్తా చాటగలగలను అని ఈ సినిమాతో ఆమె నిరూపించింది. క్లైమాక్స్ లో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు.
ఇదిలా ఉండగా, తనను బీమ్లా నాయక్ లో ఎంపిక చేయడానికి కారణాన్ని కూడా ఆమె ఇటీవల వివరించింది. తనను కళ్లతో నవరసాలు పండించమని అడిగారని, అది చూసే తనకు అవకాశం ఇచ్చారని చెప్పడం గమనార్హం.