Begin typing your search above and press return to search.

సమంత ఏం చేసినా అదో న్యూసే..!

By:  Tupaki Desk   |   24 May 2023 6:30 PM IST
సమంత ఏం చేసినా అదో న్యూసే..!
X
స్టార్ హీరోయిన్ సమంత ఏం చేసినా సరే మీడియా దాన్ని భూతద్దంలో పెట్టి చూడటం అలవాటుగా మారింది. అక్కినేని ఫ్యామిలీతో దూరమైన దగ్గర నుంచి ఆమె మీద మీడియా స్పెషల్ ఫోకస్ చేస్తుంది. ఇక ఈమధ్య తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి గురించి ఆమె పొందుతున్న ట్రీట్ మెంట్ గురించి కూడా సమంత మీద రకరకాల వార్తలు రాశారు. అయితే వాటినన్నిటినీ జస్ట్ సింపుల్ గా తన స్మైల్ తో ఆన్సర్ ఇచ్చింది సమంత. తన మీద ఎన్ని వార్తలు రాసినా తనకు ఏమీ జరగదని సమంత స్ట్రాంగ్ గా ఉంటుంది.

ఇక లేటెస్ట్ గా సమంత బాలీవుడ్ హీరోతో ఓ రేంజ్ లో ఇంటిమేట్ సీన్స్ చేస్తుందని న్యూస్ వైరల్ గా మారింది. సమంత ప్రస్తుతం హిందీలో సిటాడెల్ వెబ్ సీరీస్ చేస్తుంది. ఆ సీరీస్ లో సమంత హీరో వరుణ్ ధావన్ తో రొమాన్స్ కు రెడీ చెప్పిందట. హాలీవుడ్ సిటాడెల్ సీరీస్ కు రీమేక్ గా వస్తుండగా అక్కడ ప్రియాంక చోప్రా ఓ రేంజ్ లో హద్దులు దాటేసింది. అఫ్కోర్స్ అమ్మడు అలా రెచ్చిపోవడం కొత్తేమి కాదు. కానీ సమంత అలా చేస్తుందా అన్న డౌట్ ఉంది.

బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం సమంత సిటాడెల్ కోసం ఇంటిమేట్ సీన్స్ కు రెడీ అన్నట్టు రాసుకొచ్చింది. హీరోయిన్ గా తను ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది సమంతకు ఉంటుంది. మరి ఆమె చేస్తున్న పాత్రల మీద మీడియా ఆసక్తి ఏంటో అర్ధం కాదు. అయితే తనపై ఇలాంటి వార్తలు రావడం కొత్తేమి కాదని మెంటల్ గా ఫిక్స్ అయిన సమంత తనపై ఎలాంటి న్యూస్ వచ్చినా లైట్ తీసుకుంటుంది.

తెలుగులో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తున్న సమంత ఆ సినిమా తర్వాత మరో స్టార్ సినిమా కోసం డిస్కషన్ లో ఉందని తెలుస్తుంది. సమంత చేస్తున్న ఈ సినిమాల పట్ల మీడియా అత్యుత్సాహం ఆమె కెరీర్ కు హెల్ప్ అవుతుందనే చెప్పొచ్చు.