Begin typing your search above and press return to search.
నమ్మకమే మనల్ని వేరు చేశాయి.. సామ్ రియాక్షన్
By: Tupaki Desk | 6 May 2023 8:43 PM ISTఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన మొదటి సినిమాతోనే హిట్టు కొట్టి వరసు ఆఫర్లను దక్కించుకుంది. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారి తెలుగు సినీ ప్రేక్షుకల గుండెల్లో గూడు కట్టుకుంది. అయితే తనతో పాటే కెరియర్ ప్రారంభించిన హీరో నాగ చైతన్యతో.. ప్రేమలో పడింది. ఆ తర్వాత చాలా ఏళ్లు ప్రేమాయణం సాగించారు.
ఆ తర్వాత కొంత కాలానికి ఇరు కుంటుంబాల పెద్దలను ఒప్పించి మరీ వీరు పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్నేళ్లకే విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించి అందిరినీ షాక్ కు గురి చేశారు. ఇది నిజమని ప్రేక్షుకులు నమ్మక ముందే ఇద్దరూ విడిపోయారు. ఎవరి లైఫ్ లో బిజీగా మారి... కెరియర్ లో దూసుకుపోతున్నారు. అయిత ఇంత కాలం పాటు విడాకులపై స్పందించి వీరిద్దరూ తాజాగా స్పందిస్తున్నారు.
కస్టడీ చిత్రం ప్రమోషన్ లో పాల్గొన్న నాగ చైతన్య సామ్ తో విడాకుల గురించి స్పందించాడు. సమంత చాలా మంచిదని, ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆమె అన్ని ఆనందాలు పొందేందుకు అర్హురాలంటూ కామెంట్లు చేశారు. అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే సామ్ ఈరోజు ఇన్ స్టా వేధికగా ఓ స్టోరీ పోస్ట్ చేసింది. అందులో ఓ విషయాన్ని తెలిపింది.
మనమంతా ఒక్కటే.. కేవలం ఇగో, భయం, నమ్మకాలే మనల్ని దూరం చేశాయంటూ ఓ కొటేషన్ ను షేర్ చేసింది. చై విడాకులు, సామ్ పై స్పందించిన మరుసటి రోజే సమంత ఈ స్టోరీ పెట్టడంతో.. చై గురించే పెట్టిందని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పటికీ వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానం, గౌరవం ఉన్నాయని తెలుస్తోంది. కానీ మధ్యవర్తుల కారణంగా వచ్చిన మనస్పర్థలు, ఈగోల వల్ల వీరిద్దరూ విడిపోయినట్లు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
వీరి అభిమానులు.. మళ్లీ నాగ చైతన్య, సమంత కలిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. వీరిద్దరికీ ఇప్పటికీ ఒకరంటే ఒకరికి ప్రేమ ఉందని భావిస్తున్నారు. మరి చూడాలి. నిజంగానే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందా.. లేదా కేవలం గౌరవం, అభిమానం మాత్రమే ఉన్నాయే అనేవి. ఏది ఏమైనా వీరిద్దరూ కలిస్తే ఎంతో మంది పండగ చేసుకుంటారు.