Begin typing your search above and press return to search.

స‌మంత ఉంటే స్టార్ హీరోలు చేయ‌న‌న్నారా?

By:  Tupaki Desk   |   13 April 2023 10:30 AM IST
స‌మంత ఉంటే స్టార్ హీరోలు చేయ‌న‌న్నారా?
X
నాయికా ప్రధాన చిత్రాల్లో న‌టించేందుకు మ‌న స్టార్ హీరోల‌కు భేష‌జ‌మా? అంటే అవున‌నే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణశేఖ‌ర్ అంటున్నారు. నిజానికి శాకుంత‌లం ప్రివ్యూలు చూసిన వారంతా సినిమా బావుంద‌ని మెచ్చుకోవ‌డ‌మే గాక ఈ మూవీ కాస్టింగ్ ఎంపిక‌ల గురించి కూడా గుణ‌శేఖ‌ర్ వ‌ద్ద ప్ర‌స్థావిస్తున్నారట‌. శకుంత‌ల పాత్ర‌కు స‌మంత‌.. భ‌ర‌తుని పాత్ర‌కు అల్లు అర్హ ఎంతో బాగా కుదిరారు. ఆ ఇద్ద‌రి న‌ట‌నా అస‌మానం. అలాగే దుష్యంతుని పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ బాగానే న‌టించాడు.

కానీ దుష్యంతుని పాత్ర‌కు ఎవ‌రైనా స్టార్ హీరోని తీసుకుని ఉంటే మ‌రింత మైలేజీ వ‌చ్చి ఉండేది క‌దా? అని గుణ‌శేఖ‌ర్ కి ఉచిత స‌ల‌హాలు ప‌డేస్తున్నార‌ట కొంద‌రు. అయితే దీనికి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కూడా అంతే ధీటైన స‌మాధాన‌మిచ్చారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టించేందుకు మ‌న స్టార్ హీరోలు ముందుకు రావ‌డం లేద‌ని వారు మారాల‌ని పిలుపునిచ్చారు. తొలుత శాకుంత‌లం లో దుష్యంతుని పాత్ర కోసం కొంద‌రు టాలీవుడ్ స్టార్ హీరోల‌ను సంప్రదించామ‌ని కానీ ఎవ‌రూ చేసేందుకు ముందుకు రాక‌పోవ‌డంతోనే మ‌ల‌యాళ స్టార్ దేవ్ మోహ‌న్ తో ఆ పాత్ర‌ను చేయించామ‌ని గుణ‌శేఖ‌ర్ వెల్ల‌డించారు. అంతేకాదు.. దేవ్ మోహ‌న్ త‌న పాత్ర‌కు వంద‌శాతం న్యాయం చేసాడ‌ని కితాబిచ్చారు.

రుద్ర‌మ‌దేవి లేడీ ఓరియెంటెడ్ సినిమానే అయినా గోన గ‌న్నారెడ్డి పాత్ర‌కు అల్లు అర్జున్ వెంట‌నే అంగీక‌రించార‌ని త‌న‌లానే ఇత‌ర హీరోలు కూడా వీటికి అంగీక‌రించాల‌ని కూడా గుణ‌శేఖ‌ర్ ఇత‌ర అగ్ర హీరోల‌కు సూచించారు. అయితే శాకుంత‌లం చిత్రానికి స్టార్ ప‌వ‌ర్ యాడ‌వ్వ‌లేదు అని త‌న వ‌ద్ద ప్ర‌స్థావిస్తే మాత్రం గుణ‌శేఖ‌ర్ ఓకింత అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. శాకుంత‌లం ప్రివ్యూ చూసి దుష్యంతునిగా ఎవ‌రైనా స్టార్ హీరో న‌టించి ఉంటే బావుండేది అని భావిస్తే వారి అభిప్రాయంతో ఏకీభ‌వించిన‌ గుణ‌శేఖ‌ర్ త‌న‌కు ఎవ‌రూ స్టార్లు దొర‌క‌లేద‌ని స‌మాధాన‌మిచ్చారు. ఏది ఏమైనా కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు మ‌న స్టార్ హీరోల వైఖ‌రిపై గుణ‌ ఉన్న‌ద‌న్న‌ట్టు గా మాట్లాడేసారు. తెలుగు స్టార్లు లేడీ ఓరియెంటెడ్ లో న‌టించేందుకు వెన‌కాడుతున్నార‌నేది స్ప‌ష్ఠం.