Begin typing your search above and press return to search.

ఇంకెంత కాలం దూరంగా ఉంటావ్ సామ్..!

By:  Tupaki Desk   |   26 March 2023 6:30 PM IST
ఇంకెంత కాలం దూరంగా ఉంటావ్ సామ్..!
X
సమంత ఇజ్ బ్యాక్.. కానీ పూర్తిగా కాదు కొద్దిగానే. చాలా రోజుల నుండి సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న సమంత.. కొన్ని రోజులుగా తిరిగి యాక్టివ్ అయిపోయింది. శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కోసం మళ్లీ సోషల్ మీడియాను యాక్టివేట్ చేసేసింది సామ్. ట్రెండీ వేర్ లో తన గ్లామర్ ను ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులిస్తోంది. ఆ పిక్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే మీడియాకు మాత్రం ఇంకా దూరంగానే ఉంటోంది సమంత.

విడాకులు ఆ తర్వాత మయోసైటిస్ వల్ల సోషల్ మీడియాకు, సాధారణ మీడియాకు దూరంగా ఉండిపోయింది సమంత. ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంది. ఇంటి నుండే యశోధ డబ్బింగ్ చెప్పింది. ఆ తర్వాత కోలుకుని శాకుంతలం షూటింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు ఆ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సమంత ప్రమోషన్స్ కూడా చేస్తోంది.

ప్రమోషన్స్ అయితే చేస్తుంది కానీ మీడియాతో మాట్లాడటం లేదు సామ్. తాజాగా తెలుగు యాంకర్ సుమతో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ప్రీ రికార్డెడ్ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో అవెలెబుల్ గా ఉంది. ఇప్పుడు దీని పైనే చర్చ జరుగుతోంది.

నాగ చైతన్య నుండి డైవర్స్, ఆ తర్వాత ఆరోగ్య సమస్యలతో సతమతమై ఇప్పుడిప్పుడే బయట కనిపిస్తున్న సామ్.. మీడియాను ఫేస్ చేసేందుకు ఇష్టపడటం లేదు. విడాకులు, ఆరోగ్య సమస్యల గురించి మీడియా పర్సన్స్ నుండి ప్రశ్నలు వస్తాయేమోననే సమంత మీడియాకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

అయితే సమంత లాంటి అగ్ర హీరోయిన్ మీడియాకు దూరంగా ఉండటం ఎంత వరకు మంచిది అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే యశోధ రిలీజ్ అయి పోయింది. శాకుంతలం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో కూడా సమంత మీడియాకు దూరంగా ఉండటం ఏంటని అనుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. మరి ఇలాగే సమంత ఇంకెంత కాలం మీడియాకు దూరంగా ఉంటుందో చూడాలి.