Begin typing your search above and press return to search.

గేరు మార్చిన స‌మంత‌.. ఎక్క‌డా త‌గ్గేదేలే

By:  Tupaki Desk   |   21 May 2022 2:30 AM GMT
గేరు మార్చిన స‌మంత‌.. ఎక్క‌డా త‌గ్గేదేలే
X
మెస్మ‌రైజింగ్ న‌ట‌న‌తో, గ్లామ‌ర్ తో గ‌త కొంత కాలంగా ప్రేక్ష‌కుల్ని త‌న మాయ‌లో ప‌డేసిన స‌మంత గేర్ మార్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. మునుప‌టి జోష్ తో ఎక్క‌డా త‌గ్గేదిలే అంటూ వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్ ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ వ‌రుస‌గా షాకులిస్తోంది. నాగ‌చైత‌న్య‌తో విడాకుల ప్ర‌క‌ట‌న త‌రువాత ఒక్క‌సారిగా డీలాప‌డిపోయిన స‌మంత ఆ డిప్రెష‌న్ నుంచి బ‌య‌టికి రావ‌డానికి శ‌ద విధాలా ప్ర‌య‌త్నించింది. ఆశ్చ‌ర్య ప‌రిచే కోట్ ల‌తో త‌ను ఎంతగా మాన‌సికంగా ఇబ్బందికి గుర‌వుతున్నదో స్ప‌ష్టం చేసింది.

ఆ త‌రువాత మాన‌సిక ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం త‌న స్నేహితురాలితో క‌లిసి ఆధ్యాత్మిక యాత్ర‌కు వెళ్లింది. అక్క‌డి నుంచి తిరిగి వ‌చ్చాక సామ్ కు `పుష్ప‌` రూపంలో గోల్డెన్ ఆఫ‌ర్ ల‌భించింది. బ‌న్నీ న‌టించిన ఈ మూవీ కోసం తొలిసారి సమంత ఐట‌మ్ సాంగ్ చేసిన విష‌యం తెలిసిందే. `ఊ అంటావా.. ఊహూ అంటావా..` అంటూ స్పైసీ ఐట‌మ్ నంబ‌ర్ తో సామ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. గ‌త చిత్రాల‌కు మించి మ‌రింత గ్లామ‌ర్ గా సామ్ క‌నిపించి చేసిన ఈ సాంగ్ పాన్ ఇండియా వైడ్ గా చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.

సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిలిచిన ఈ ప్ర‌త్యేక గీతం సామ్ ని పాన్ ఇండియా వైడ్ గా పాపుల‌ర్ అయ్యేలా చేసింది. అక్క‌డి నుంచే స‌మంత కొత్త‌గా ఆలోచించ‌డం, అడుగులు వేయ‌డం మొద‌లు పెట్టింది. ఇక‌పై వ‌రుస‌గా సినిమాలు చేయాల‌ని, క‌థ న‌చ్చితే ఎంత ఎలాంటి పాత్ర అయినా చేయాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. ఇటీవ‌ల బాలీవుడ్ ఆఫ‌ర్లు ప‌ల‌క‌రించినా అవి సెకండ్ హీరోయిన్ క్యారెక్ట‌ర్లు కావ‌డంతో పెద్ద‌గా స్పందించ‌ని స‌మంత తెలుగు, త‌మిళ భాష‌ల్లో క్రేజీ చిత్రాల్లో న‌టించ‌డం మొద‌లు పెట్టింది.

గుణ‌శేఖ‌ర్ `శాకుంతం` పూర్తి చేసిన స‌మంత అదే స్పీడుతో మ‌రో మ‌హిళా ప్ర‌ధాన చిత్రం `య‌శోద‌`ని రాకెట్ స్పీడుతో పూర్తి చేస్తోంది. సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ కూడా త్వ‌ర‌లో రిలీజ్ కు రెడీ అవుతుండ‌టంతో తాజాగా రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ తో `ఖుషీ` మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ప్ర‌స్తుతం ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ క‌శ్మీర్ లో జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఈ మూవీ టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. రొమాంటిక్ ల‌వ్ స్టోరీ కావ‌డం, క‌శ్మీర్ నేప‌థ్యం కావ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇదిలా వుంటే బాలీవుడ్ లో త‌న‌కు `ఫ్యామిలీమ్యాన్ 2` వెబ్ సిరీస్ తో బ్రేకిచ్చిన డైరెక్ట‌ర్స్ రాజ్ అండ్ డీకె తో మ‌రో వెబ్ డ్రామాకు సైన్ చేసింది. త్వ‌ర‌లోనే ఈ వెబ్ సిరీస్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో స‌మంత ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ఓకే చేసి త‌న దూకుడుని పెంచేసింది. గేరు మార్చిన స‌మంత‌.. ఎక్క‌డా త‌గ్గేదేలే అంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అంగీక‌రిస్తూ మునుప‌టి దూకుడుని చూపిస్తోంది. ఓ ప‌క్క క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ చేస్తూనే వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.