Begin typing your search above and press return to search.

సాయి ప‌ల్ల‌వి అంత డిమాండ్ చేస్తోందా?

By:  Tupaki Desk   |   16 Sept 2020 11:30 AM IST
సాయి ప‌ల్ల‌వి అంత డిమాండ్ చేస్తోందా?
X
రౌడీ రాణి సాయిప‌ల్ల‌వికి ఉన్న క్రేజు గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. గ్రేట్ డ్యాన్స‌ర్ గా పెర్ఫామ‌ర్ గా సౌత్ లో త‌న‌కు ఉన్న ఐడెంటిటీ అంతా ఇంతా కాదు. సాయి ప‌ల్ల‌వి పేరు మీద‌నే సినిమాకి బిజినెస్ గ్యారెంటీ ఉంది. అందుకే త‌న కాల్షీట్ల కోసం అగ్ర నిర్మాత‌లు అంతా క్యూలో నిలుస్తుంటారు.

ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య స‌ర‌స‌న శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ స్టోరి లో నటిస్తోంది. లాక్ డౌన్ స‌మ‌యంలో విరామం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ త‌ర్వాత నాని తదుపరి చిత్రం `శ్యామ్ సింఘరాయ్`లో న‌టించ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ట‌. ఇప్ప‌టికే స్క్రిప్టు వినేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తెలుస్తోంది.

అయితే సాయి ప‌ల్ల‌విని ఒప్పించ‌డం అంటే అంత ఆషామాషీ ఏం కాదు. త‌న‌కు క‌థ‌.. త‌న పాత్ర కూడా న‌చ్చాలి. దాంతో పాటు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో త‌న కండీష‌న్స్ అన్నీ ముందే చెప్పేస్తుంద‌ని చెబుతుంటారు. అంతేకాదు.. ఒక్కో సినిమాకి ఈ బ్యూటీ ఏకంగా రూ.2కోట్లు డిమాండ్ చేస్తుంద‌ట‌. అంత పెద్ద మొత్తం పారితోషికంగా చెల్లించేందుకు సిద్ధ‌మైతేనే సంప్ర‌దించాల్సి ఉంటుంద‌ట‌. శ్యామ్ సింఘరాయ్ చిత్రానికి రాహుల్ సంకృతన్ దర్శకత్వం వహించనున్నారు. కోల్‌కతా నేపథ్యంలో ఈ మూవీని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. శ్యామ్ సింఘా రాయ్‌కు ముగ్గురు క‌థానాయిక‌లు న‌టించ‌నున్నారు. సీతార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించ‌నుంది.