Begin typing your search above and press return to search.

'చంద్రముఖి' చేయలేకపోవడం దురదృష్టమంటున్న హీరోయిన్!

By:  Tupaki Desk   |   30 Jun 2021 3:30 AM GMT
చంద్రముఖి చేయలేకపోవడం దురదృష్టమంటున్న హీరోయిన్!
X
తెలుగులో కథానాయికగా 'సదా' కొన్ని సినిమాలు చేసింది. అయితే తొలి సినిమా 'జయం' స్థాయిలో మిగతా సినిమాలు ఆడలేదు. అయితే తమిళంలో విక్రమ్ సరసన చేసిన 'అపరిచితుడు' ద్వారా కూడా ఆమెకి ఇక్కడ మంచి క్రేజ్ వచ్చింది. ఆ తరువాత ఆశించినస్థాయిలో తెలుగులో విజయాలు అందకపోవడంతో, ఇతర భాషా చిత్రాలలో అవకాశాలను అందుకుంటూ వెళ్లింది. ఆమె అసలు తెలుగు తెరపై కనిపించక అయిదారేళ్లు అవుతోంది. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' వేదిక ద్వారా తన కెరియర్ ముచ్చట్లను పంచుకుంది.

'చంద్రముఖి' సినిమాలో జ్యోతిక చేసిన పాత్ర కోసం ముందుగా నన్ను అడిగారు. అయితే ఆ సమయంలో నేను వేరే సినిమాను చేస్తున్నాను. 'ఇలా ఒక మంచి అవకాశం వచ్చింది .. చేస్తాను' అని వాళ్లను అడిగితే కుదరదని చెప్పారు. ఆ తరువాత కొన్ని రోజులకు 'చంద్రముఖి' టీమ్ వచ్చి మళ్లీ కలిసింది. ఆ సినిమాలో రజనీ సరసన నాయిక పాత్ర కోసం అడిగారు. దాంతో నేను ఆల్రెడీ చేస్తున్న సినిమా దర్శక నిర్మాతలను మరోసారి రిక్వెస్ట్ చేశాను. అయినా వాళ్లు ఒప్పుకోకపోవడంతో చేయలేకపోయాను. ఆ పాత్ర నయనతారకు వెళ్లింది.

'చంద్రముఖి' సినిమా చేసే అవకాశం లేకపోవడం నిజంగా దురదృష్టం. ఇప్పటికీ నాకు ఈ విషయం బాధ కలిగిస్తూ ఉంటుంది. ఇక శేఖర్ కమ్ములగారి దర్శకత్వంలో వచ్చిన 'ఆనంద్'లోను నేను చేయలేకపోయాను .. అందుకు కారణం ఎవరో కాదు .. నేనే. ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం నన్ను అడిగారు. కొత్త దర్శకుడు .. కొత్త ప్రొడక్షన్ ఎలా ఉంటుందో .. ఏమిటో అనే ఒక సందేహంతో ఆ సినిమాను వదిలేశాను. నిజంగా ఆ సినిమా చేసి ఉంటే బాగుండేదని నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చింది.