Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఈ పిల్లలో ఇంత హాట్ నెస్ ఉందా?

By:  Tupaki Desk   |   30 April 2019 4:48 AM GMT
ఫోటో స్టొరీ: ఈ పిల్లలో ఇంత హాట్ నెస్ ఉందా?
X
మనకు టాలీవుడ్ నిండా ఉత్తరాది భామలే. అలాంటి భామలలో ఒక భామ రుహాని శర్మ. పంజాబీ బ్యూటీ అయిన ఈ రుహాని సుశాంత్ హీరోగా తెరకెక్కిన 'చిలసౌ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఆడియన్స్ ను మెప్పించింది.రుహాని పోషించిన గ్లామర్ జిలుగులు లేని సింపుల్ మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రకు మంచి మార్కులే వచ్చాయి కానీ తర్వాత క్రేజీ ఆఫర్లు మాత్రం రాలేదు. మరి నిజంగా ఆఫర్లు రాలేదో లేక అదేపనిగా స్పైసీనెస్ లేని మధ్యతరగతి పాత్రలే ఆఫర్ చేస్తున్నారేమో కానీ రుహాని తన రూటు మార్చి గ్లామర్ గేరు వేసింది.

ఈ జెనరేషన్ భామలందరూ సోషల్ మీడియాలో హీటర్లు కదా.. అలాగే రుహాని కూడా వేడి పెంచే ప్రయత్నాలు షురూ చేసింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా రుహాని ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో బీచ్ ఒడ్డున జస్ట్ అలా నిలబడి ఒక హాటు ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. కాస్ట్యూమ్ చూస్తే డబల్ హాటు. స్లీవ్ లెస్ బ్లాక్ టాప్. డీప్ వీ నెక్ ఉండడంతో సముద్రపు ఒడ్డున అందాలను ఇసుకతిన్నెలపై పరిచినట్టుగా అయిపోయింది. అసలు ఈ పిల్లలో ఇంత హాట్ నెస్ ఉందా? అని అనుమానం వచ్చేలా సెక్సి పోజు ఇచ్చింది.

సంప్రదాయవాదులు విరుచుకుపడాతారు.. కానీ తప్పేమీ లేదు. ఎందుకంటే అసలే ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల్లో కాస్త ఒంటికి గాలి తగిలేలా డ్రెస్ వేసుకుంటే తప్పేంటి? పుణ్యం పురుషార్థం అంటారు కదా? ఒకవైపు గాలి ఆడుతుంది.. మరోవైపు ఆఫర్ల గాలి వీచే అవకాశం కూడా ఉంటుంది. కానీ నెటిజనుల పరిస్థితి మాత్రం "శీను.. ఊపిరి ఆడడం లేదు.. బైటకు తీసుకెళ్ళు" అనేలా ఉంది.