Begin typing your search above and press return to search.
రేణు దేశాయ్ 'ఆద్య' ఆరంభం..!
By: Tupaki Desk | 26 Oct 2020 2:44 PM ISTసినీ అభిమానులకు రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కొన్నాళ్ళు నటనకు దూరం అయినప్పటికీ కాస్ట్యూమ్ డిజైనర్ గా రచయితగా నిర్మాతగా దర్శకురాలిగా రేణు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ''ఆద్య'' అనే పవర్ ఫుల్ లేడి ఓరియంటెడ్ పాన్ ఇండియా వెబ్ సిరీస్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టారు రేణు దేశాయ్. ఈ వెబ్ సిరీస్ ని డి.ఎస్.కె.స్క్రీన్ - సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై డి.ఎస్.రావు - రజనీకాంత్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ తో యువ ప్రతిభాశాలి ఎం.ఆర్.కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యు అండ్ ఐ పద్మనాభరెడ్డి సమర్పిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో నందిని రాయ్ తోపాటు బాలీవుడ్ హీరో వైభవ్ తత్వవాడి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. నిన్న విజయదశమి సందర్భంగా 'ఆద్య' వెబ్ సిరీస్ ప్రారంభం అయింది.
నిర్మాణ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు జరిగిన అనంతరం స్క్రిప్ట్ ను ప్రముఖ పారిశ్రామికవేత్త చింతిరెడ్డి అనంత్ రెడ్డి దర్శకుడు కృష్ణకు అందించారు. రేణు దేశాయ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు నీలకంఠ కెమెరా స్విచాన్ చేయగా.. డి.ఎస్.రావు క్లాప్ కొట్టారు. ఎం.ఆర్.కృష్ణ మామిదాల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు శివేంద్ర దాశరధి - 'పిల్ల జమిందార్' డైరెక్టర్ అశోక్ - బి.వి.వి.చౌదరి - రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు రజనీకాంత్.ఎస్ - డి.ఎస్.రావు మాట్లాడుతూ ''రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న 'ఆద్య' జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం'' అని తెలిపారు.
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. 'దర్శకుడు కృష్ణ చెప్పిన కథ తనను విపరీతంగా ఆకట్టుకుందని.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేంత గొప్ప కథ' అని అన్నారు. దర్శకుడు ఎం.ఆర్.కృష్ణ మామిడాల మాట్లాడుతూ 'తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, తన కథను సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసి, తనను ప్రోత్సహిస్తున్న రేణు దేశాయ్ మేడమ్ కి ఎప్పటికీ రుణపడి ఉంటాన'ని తెలిపారు. రేణు దేశాయ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుండడం గర్వంగా ఉందని నటి నందిని రాయ్ అన్నారు. కాగా 'ఆద్య' వెబ్ సిరీస్ కి కథా సహకారం-మాటలు ఆదిత్య భార్గవ్ అందిస్తుండగా శివేంద్ర దాశరధి ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు.