Begin typing your search above and press return to search.

ఆ వీడియో నిజం కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటి

By:  Tupaki Desk   |   4 Jun 2021 3:00 PM IST
ఆ వీడియో నిజం కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటి
X
ఇటీవల మలయాళ నటి రెమ్య సురేష్‌ అంటూ ఒక వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. ఆ వీడియో తో ఒక్కసారిగా రెమ్య సురేష్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. రెమ్య సురేష్ గురించిన ప్రచారం దేశ వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఆమె స్పందించింది. రెమ్య స్పందిస్తూ ఆ వీడియోలో కనిపిస్తున్నది తాను కాదు అంటూ క్లారిటీ ఇచ్చింది. మీడియాలో ఆ వీడియోను ట్రెండ్‌ చేయడం నిలిపి వేయాలంటూ విజ్ఞప్తి చేసింది.

ఇప్పటికే తన ఫేస్ తో మార్ఫింగ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేసి తన పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సైబర్ డిపార్ట్‌ మెంట్‌ కు ఫిర్యాదు ఇచ్చింది. అచ్చు తనలాగే ఉన్న వ్యక్తి లేదా తన ఫేస్ తో మార్ఫింగ్‌ చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తన జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రతయ్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమయంలో తన భర్త తనకు మద్దతుగా ఉన్నాడంటూ చెప్పుకొచ్చింది.

కన్నీరు పెట్టుకుని ఆ వీడియో తనది కాదంటూ రెమ్య సురేష్‌ ఎమోషనల్‌ అయ్యింది. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన రెమ్య సురేష్‌ సోషల్‌ మీడియాలో మరెవ్వరు అయినా ఆ వీడియోను షేర్‌ చేయవద్దంటూ విజ్ఞప్తి చేసింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదు అంటూ క్లారిటీ ఇచ్చిన రెమ్య మళ్లీ మళ్లీ కన్నీరు పెట్టుకుని షేర్‌ చేయవద్దంది.