Begin typing your search above and press return to search.

కౌగిలింత ముద్దు అంటేనే భ‌యప‌డుతోంది!

By:  Tupaki Desk   |   29 Jun 2020 1:00 PM IST
కౌగిలింత ముద్దు అంటేనే భ‌యప‌డుతోంది!
X
అస‌లే లాక్ డౌన్.. ఆపై ప‌రిమిత సిబ్బంది తో షూటింగ్... ఇలాంటి వేళ ఆన్ లొకేష‌న్ నిర్మానుష్యం లో అందాల క‌థానాయిక‌ల‌ తో ముద్దు సీన్లు.. కౌగిలింత‌ల సీన్లు తీస్తామంటే భ‌యం ఉండ‌దా? ఎందుకు ఉండ‌దు! అని భావిస్తే అది త‌ప్పే. స‌మ‌స్య ప‌రిమిత సిబ్బంది తో కాదు... అంటు రోగంతో.

అలా హీరోగారు ద‌గ్గ‌ర‌కు లాక్కుని కౌగిలించుకుని ముద్దులు పెట్టేస్తే ఎలాంటి ఆందోళ‌నా లేదు కానీ.. ఎట్నుంచి ఏ రోగం అంటుకుంటుందోన‌నేదే అస‌లు భ‌యం. ముఖ్యం గా మ‌హ‌మ్మారీ త‌రుముకొస్తుంటే ఈ ఆందోళ‌న క‌థానాయిక‌ల్లో.. ఆర్టిస్టుల్లో అంత‌కంత‌కు పెరుగుతోంది. పాపం రెజీనాని కూడా అదే వెంటాడింద‌ట‌.

మ‌హ‌మ్మారీ వైరస్ మహమ్మారి కాలంలో క్లోజ‌ప్ సన్నివేశాల్లో నటించాలంటేనే అంతా భ‌య‌ప‌డుతున్నారు. దేశవ్యాప్తంగా పలువురు నటులు దీనిపై తీవ్ర ఆందోళనను వ్య‌క్తం చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ-``కౌగిలింత లేదా ముద్దు వంటి సన్నిహిత సన్నివేశాల్లో నటించడానికి భయ పడుతున్నాన‌ని .. ప్రాణాంతక వైరస్ సంభవిస్తుందనే భయం గా ఉంది`` అని తెలిపింది.

రెజీనా ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా బిజీ. ఈ అమ్మ‌డు న‌టించిన త‌మిళ్ - తెలుగు ద్విభాషా చిత్రం పార్టీ రిలీజ్ కి రావాల్సి ఉంది. దీంతో పాటే నేంజమ్ మ‌ర‌ప్ప‌థిల్లై- క‌స‌డ త‌ప‌ర‌- క‌ల్లాప‌ర్ట్ అనే చిత్రాల్లో న‌టిస్తోంది. టాలీవుడ్ లో స‌రైన ఆఫ‌ర్ కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌ట‌.