Begin typing your search above and press return to search.

ఆ న‌టిపై తాగి మీద ప‌డ్డారా?

By:  Tupaki Desk   |   19 Aug 2022 12:30 AM GMT
ఆ న‌టిపై తాగి మీద ప‌డ్డారా?
X
ఆ యువ న‌టి ఇండ‌స్ర్టీకి పెద్ద హీరోయిన్ అవ్వాల‌ని ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరో చిత్రంతోనే స‌పోర్టింగ్ రోల్ తో ఎంట్రీ ఇచ్చింది. అటుపై ఓ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడి సినిమాతో మెయిన్ లీడ్ కి ప్ర‌మోట్ అయింది. కానీ ఆ సినిమా ఫ‌లితం అమ్మ‌డిని నిరాశ‌ప‌రించింది. అయినా ప‌ట్టువ‌ద‌ల్లేదు. వ‌చ్చిన అవ‌కాశాల్ని అందిప‌చ్చుకుంటూ న‌టిగా ఎస్టాబ్లిష్ అయింది.

ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. ఈ క్ర‌మంలోనే బిగ్ బాస్ లోనూ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. ఆ గుర్తింపు న‌టిగా క‌న్నా మ‌రింత పాపుల‌ర్ చేసింది. మ‌ధ్య మ‌ధ్య‌లో మెయిన్ లీడ్స్ లో మరికొన్ని సినిమాల‌తో మెప్పించే ప్ర‌య‌త్నం చేసింది. కానీ త‌న డ్రీమ్ మాత్రం ఇంకా ఫుల్ ఫిల్ కాలేదు. అలాగ‌ని నిరాశ‌ప‌డి ప్ర‌య‌త్నాలు ఆపింది లేదు.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల మ‌రో బిగ్ ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా నేప‌థ్యం ఇండ‌స్ర్టీని ప‌ట్టిపీడిస్తున్ ఓ బ‌ర్నింగ్ టాపిక్ ని బేస్ చేసుకుని తెర‌కెక్కించారు. ఆ పాత్ర కి అమ్మ‌డు ప‌క్కాగా యాప్ట్ అయింది. త‌నలో ధైర్య‌శాలిని మ‌రోసారి ఈ సినిమాతో త‌ట్టి లేపుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌చారంలో భాగంగా ఆ బ్యూటీ చేస్తోన్న వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి ఇండ‌స్ర్టీ ఎన్నో విష‌యాల్ని నేర్పిన‌ట్లు క‌నిపిస్తుంది.

న‌టిగా ఆ స‌క్సెస్ అవ్వాలంటే ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి ఫేవ‌ర్స్ చేయాల్సి ఉంటుంది అన్న అంశాన్ని సైతం ట‌చ్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. స్ర్కిప్ట్ డిమాండ్ మేర‌కు మ‌రో వ‌ర్ధ‌మాన న‌టి అనుభ‌వాల్ని సైతం రంగ‌రించిన‌ట్లు స‌మాచారం. మొత్తంగా క‌థ ప‌రంగా చూస్తే రాంగోపాల్ వ‌ర్మ మేధోథ‌నం క‌నిపిస్తుంది. రిలీజ్ త‌ర్వాత గాని అస‌లు మ్యాట‌ర్ ఏంట‌న్న‌ది తెలియ‌దు.

తాజాగా ఓ యూ ట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇండ‌స్ర్టీకి వ‌చ్చిన త‌ర్వాత త‌ను అనుభ‌వాల్ని పంచుకుంది. ఇండ‌స్ర్టీకి వ‌చ్చిన కొత్త అమ్మాయి ప‌ట్ల కొంత మంది ఎలాంటి ఆలోచ‌న‌తో ఉంటారు? ఎలాంటి ప్రవ‌ర్త‌న‌తో మెలుగుతారో? ఇలాంటి అనుభ‌వాలు ద‌గ్గ‌ర‌గా చూసానంటోంది. ఈ నేప‌థ్యంలో కెరీర్ ఆరంభంలో ఎదురైన ఓ చేదు ఘ‌ట‌నని ఎంతో ధైర్యంగా ఎదుర్కున్న‌ట్లు రివీల్ చేసింది.

తెలంత‌గాణ లోని ఓ జిల్లాలో నిర్వ‌హించిన సినిమా ఈవెంట్ కి వెళ్లొస్తుంటే? మార్గ మ‌ధ్య‌లో కొంద‌రు ఆక‌తాయిలు తాగి మీద ప‌డ‌బోయారంట‌. తాను ఎవ‌రో తెలిసే దుండ‌గులు అలాంటి చ‌ర్య‌కి పాల్ప‌డాల‌ని చూసారుట‌. దీంతో ఆ ఘ‌టన నుంచి ఎంతో తెలివిగా ఎస్కేప్ అయిన‌ట్లు తెలిపింది.