Begin typing your search above and press return to search.

సౌత్‌ లో నెం.1 రష్మిక... దగ్గర్లో కూడా ఎవరు లేరు

By:  Tupaki Desk   |   11 Aug 2021 9:33 AM IST
సౌత్‌ లో నెం.1 రష్మిక... దగ్గర్లో కూడా ఎవరు లేరు
X
కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న హీరోయిన్‌ గా తెలుగు లో గీత గోవిందం తో ఒక్కసారిగా స్టార్‌ అయ్యింది. తెలుగు లో వరుసగా భారీ చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు మరో వైపు హిందీ.. తమిళం.. కన్నడం సినిమాల్లో కూడా నటిస్తోంది. పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకు పోతున్న ముద్దుగుమ్మ పారితోషికం విషయంలో సౌత్ లో టాప్ లో దూసుకు పోతుంది. తెలుగు లో ఈమె చేస్తున్న పుష్ప తో పాటు ఇతర సినిమాలు విడుదల అయితే ఈమె క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం అనడంలో సందేహం లేదు. ఇక ఈమద్య కాలంలో స్టార్స్ స్టేటస్ ను మరియు వారి యొక్క స్టామినాను సోషల్‌ మీడియా ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా నిర్థారిస్తున్నారు. సౌత్‌ స్టార్ హీరోయిన్స్ లో ఇన్‌ స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ సంఖ్య విషయంలో అత్యధికంగా ఫాలోవర్స్‌ కలిగి ఉన్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఈ అమ్మడు తాజాగా 20 మిలియన్ ల క్లబ్ లో జాయిన్‌ అయ్యింది. బాలీవుడ్‌ కు చెందిన కొద్ది మంది ముద్దుగుమ్మలకు మాత్రమే ఈ ఘనత దక్కింది. సౌత్ లో ఏ ఒక్క హీరోయిన్ కూడా ఈస్థాయిలో ఫాలోవర్స్ సంఖ్యను కలిగి లేరు అనడంలో సందేహం లేదు.

రష్మిక ఇన్ స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ సంఖ్య చాలా తక్కువ సమయంలోనే 20 మిలియన్‌ కు చేరడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్స్ గా ప్రస్తుతం రష్మిక మందన్నా తో పాటు పూజా హెగ్డే.. సమంత.. కీర్తి సురేష్‌.. సాయి పల్లవి.. శృతి హాసన్.. కాజల్.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వీరంతా కూడా ఫాలోవర్స్ విషయంలో రష్మిక మందన్నా వెనుకే ఉన్నారు. పూజా హెగ్డే కు సోషల్ ఇన్ స్టాలో 14.8 మిలియన్‌ ల ఫాలోవర్స్ ఉన్నారు. రష్మిక మందన్నా తర్వాత స్థానంలో కాజల్‌ అగర్వాల్‌ 19.3 మిలియన్ ల ఫాలోవర్స్ తో రెండవ స్థానంలో ఉంది. వీరిద్దరికి ఇతరులు చాలా దూరంలో ఉండి పోయారు. సమంతకు 18 మిలియన్‌ ఫాలోవర్స్ ఉండగా.. తమన్నాకు 14 మిలియన్స్ ఫాలోవర్స్.. రకుల్‌ కు 17.3 మిలియన్స్‌ ఫాలోవర్స్‌.. కీర్తి సురేష్‌ కు 10 మిలియన్స్‌ ఫాలోవర్స్.. శృతి హాసన్‌ కు 17.2 మిలియన్స్ ఫాలోవర్స్‌ ఉన్నారు.

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే రష్మిక మందన్నా రెగ్యులర్ గా తన హాట్‌ ఫొటోలతో పాటు తన డైలీ లైఫ్‌ ఫొటోలను మరియు వీడియోలను ఇంకా తన పెట్‌ కు సంబంధించిన ముచ్చటర్లను షేర్‌ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా 20 మిలియన్స్ ఫాలోవర్స్ ను చేరువ అయినందుకు గాను ఈ అమ్మడు తన ఆనందాన్ని అభిమానులతో షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం పుష్ప తో పాటు బాలీవుడ్‌ లో ఇతర భాషల్లో చేస్తున్న సినిమాలు విడుదల అయితే ఈమె క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈమె జోరు చూస్తుంటే అతి తక్కువ సమయంలోనే 30 మిలియన్ ల ఫాలోవర్స్ ను దక్కించుకుని బాలీవుడ్‌ స్టార్స్ కు కూడా పోటీ గా నిలుస్తుందేమో అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్ కనుక ఆ మాత్రం స్టార్‌ డమ్‌.. ఫాలోవర్స్ ఉండటం కామన్ విషయం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చేతిలో అర డజను సినిమాలు ఉన్నా కూడా కొత్త సినిమాలకు ఈమె కమిట్‌ అవుతూనే ఉంది