Begin typing your search above and press return to search.
ఊపిరి తీసుకోవడం కూడా తప్పే అవుతోంది.. హీరోయిన్ ఆవేదన
By: Tupaki Desk | 22 Jan 2023 11:25 AM ISTహీరోయిన్ రష్మిక మందన్నా ఈమధ్య కాలంలో ఆన్ లైన్ లో ప్రతి విషయానికి విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ మధ్య కన్నడ సినిమా కాంతార గురించి స్పందించలేదని విమర్శలు చేసిన వారు ఆ తర్వాత రిషబ్ శెట్టి మరియు రక్షిత్ శెట్టి గురించి పాజిటివ్ గా మాట్లాడింది అని కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి రష్మిక ప్రతి విషయానికి టార్గెట్ అవుతోంది.
ఇటీవల ఈ అమ్మడు నటించిన వారిసు సినిమా తమిళనాట సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాంతో తమిళనాట ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు దక్కనున్నాయి అంటూ సినీ విశ్లేషకులు నమ్మకంగా చెబుతున్నారు.
మరో వైపు హిందీలో ఈమె నటించిన మిషన్ మజ్ను సినిమా కూడా మంచి ఆధరణ దక్కించుకుంటూ ఉంది. హిందీలో కూడా ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలుగు లో పుష్ప 2 సినిమా తో పాటు నితిన్ కి జోడీగా ఒక సినిమాలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.
కెరీర్ లో ఇంత బిజీగా ఉన్న రష్మిక మందన్నా ప్రతి రోజు ఏదో ఒక విషయం తో సోషల్ మీడియాలో ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే తాజాగా ఒక టాక్ షో లో రష్మిక మందన్నా మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేసింది. తనపై వస్తున్న ట్రోల్స్ తో మానసికంగా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
రష్మిక మాట్లాడుతూ... నేను వర్కౌట్ చేస్తే విమర్శలు.. కాస్త లావుగా కనిపిస్తే విమర్శలు చేస్తున్నారు. ఏదైనా విషయంలో నేను మాట్లాడితే అతి అంటూ విమర్శలు.. మాట్లాడకుంటే యాటిట్యూడ్ అంటూ ట్రోల్స్. చివరకు నేను ఊరిపి పీల్చుకుంటే కూడా ట్రోల్స్ చేసే పరిస్థితి వచ్చేలా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఇతరుల గురించి మాట్లాడే సమయంలో వారి యొక్క మానసిక పరిస్థితిని ప్రభావితం చేస్తాం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ ఒక్క హీరోయిన్ ను కూడా ఈ స్థాయిలో ట్రోల్స్ చేయలేదని... తనను మాత్రమే కొందరు ద్వేషిస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నారని రష్మిక ఎమోషనల్ అయ్యింది.
ట్రోల్స్ నా మానసిక పరిస్థితి పై ప్రభావం చూపిస్తాయి. నా ఫ్యామిలీని కూడా కొందరు విమర్శిస్తూ ఉంటే బాధగా ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రష్మిక మందన్నా ట్రోల్స్ గురించి ఎక్కువ ఆలోచించకుంటే ఉత్తమం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ట్రోల్స్ గురించి ఎంతగా ఆలోచిస్తే అంతగా బాధ.. ట్రోల్స్ గురించి ఎంతగా స్పందిస్తే అంతకు రెట్టింపు ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. కనుక రష్మిక సోషల్ మీడియా ట్రోల్స్ ను పట్టించుకోకుండా ఉండటం ఉత్తమం.