Begin typing your search above and press return to search.

ఎవ‌ర్ గ్రీన్ ప్రేమ‌క‌థల‌ ఫ్రాంఛైజీలో ర‌ష్మిక‌?

By:  Tupaki Desk   |   18 Sept 2022 11:24 AM IST
ఎవ‌ర్ గ్రీన్ ప్రేమ‌క‌థల‌ ఫ్రాంఛైజీలో ర‌ష్మిక‌?
X
సౌత్ లో సుమారు రూ.2-3 కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటున్న ర‌ష్మిక మంద‌న ఒక్కసారిగా ముంబై ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టి గేమ్ ఛేంజ‌ర్ గా మారిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా హిట్టు `పుష్ప-ది రైజ్` తో శ్రీ‌వ‌ల్లిగా ఉత్త‌రాదిన వేవ్స్ క్రియేట్ చేసింది ర‌ష్మిక మంద‌న. అంత‌కుముందే నేష‌న‌ల్ క్ర‌ష్ అన్న పాపులారిటీతో అమాంతం త‌న రేంజు స్కైని తాకింది. అదే క్ర‌మంలో హిందీ ప‌రిశ్ర‌మ‌లో ఒక్కో సినిమాకు 4 కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటోంద‌న్న గుస‌గుసా వినిపిస్తోంది. అదే రేంజులో ఇప్పుడు పుష్ప 2 కోసం డిమాండ్ చేస్తోంద‌ని మ‌రో టాక్ వినిపించింది.

ఇదిలా ఉండ‌గా ర‌ష్మిక త‌న `పుష్ప 2` రోల్ కోసం ప్రిప‌రేష‌న్ స్టార్ట్ చేసింది. మ‌రోవైపు ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న వారిసులో న‌టిస్తూ.. త్వ‌ర‌లో విడుద‌ల‌కు రానున్న హిందీ చిత్రం గుడ్ బాయ్ కి ప్ర‌మోష‌న్ చేస్తోంది. ఇంత బిజీలోనూ యువ‌హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా స‌ర‌స‌న మిష‌న్ మ‌జ్ను కోసం ట‌చ్ లో ఉంది. ఇటీవ‌లి కాలంలో ఇంత బిజీగా ఉన్న వేరొక సౌత్ బ్యూటీ లేరంటే న‌మ్మాలి. ఎంపిక చేసిన ప్ర‌తిపాత్రా దేనిక‌దే ప్ర‌త్యేకం. గుడ్ బాయ్ లో అమితాబ్ కి కూతురుగా న‌టిస్తున్న ర‌ష్మిక ప్రాముఖ్య‌త ఉన్న పాత్ర‌లో న‌టిస్తోంది. మిషన్ మ‌జ్నులో స్పై ఆప‌రేషన్ లో పాల్గొనే యాక్ష‌న్ క్వీన్ గా క‌నిపించ‌నుంది. పుష్ప‌లో రొమాంటిక్ మాస్ గాళ్ గా క‌నిపించ‌నుంది. వీటన్నిటికీ భిన్నంగా పూర్తి ప్రేమ‌క‌థా చిత్రంలో ఒక ప్ర‌ముఖ యువ‌హీరోతో రొమాన్స్ కి రెడీ అవుతోంద‌న్న గుస‌గుసా వేడెక్కిస్తోంది.

ర‌ష్మిక మంద‌న పాపుల‌ర్ ఫ్రాంఛైజీ కి సంత‌కం చేయ‌బోతోంద‌న్న వార్త ముంబై మీడియాలో దావాన‌లంలా మారంది. పాపుల‌ర్ ఫ్రాంఛైజీ సినిమాలు ఆషిఖి- ఆషిఖి 2 చిత్రాల‌కు కొన‌సాగింపుగా ఆషిఖి 3 తెర‌కెక్క‌నుంది. ఈ మూడో భాగంలో ర‌ష్మిక మంద‌న‌ను క‌థానాయిక‌గా ఎంపిక చేయ‌నున్నార‌ని కార్తీక్ ఆర్య‌న్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ చిత్రానికి అనురాగ్ బ‌సు ద‌ర్శ‌కుడు. నిజానికి ఆషిఖి ప్రేమ‌క‌థా చిత్రాల్లో ఒక సంచ‌ల‌నం. ఆషిఖి 2తో ఆదిత్యారాయ్ క‌పూర్ కి శ్ర‌ద్ధా క‌పూర్ కి ఎంత గొప్ప మైలేజ్ ద‌క్కిందో తెలిసిందే. ఇప్పుడు ర‌ష్మిక మంద‌న రేంజు అమాంతం మారిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.