Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ తో రష్మిక తలపొగరు

By:  Tupaki Desk   |   12 Jun 2022 12:30 AM GMT
సూపర్ స్టార్‌ తో రష్మిక తలపొగరు
X
పుష్ప సినిమా తో రష్మిక మందన్నా పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్ గా మారిపోయింది. హీరోయిన్ గా వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్న ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క చోట కూడా వరుసగా భారీ చితాలను చేస్తూ దూసుకు పోతుంది. భారీ పారితోషికాన్ని దక్కించుకుంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ముఖ్యమైన సినిమా విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఒకటి.

తమిళ సూపర్ స్టార్‌ విజయ్‌ హీరోగా తెలుగు లో మొదటి సారి నటిస్తున్న సినిమా అది కూడా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అవ్వడంతో అక్కడ ఇక్కడ అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను దిల్‌ రాజు భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నాడు. వంశీ పైడిపల్లి ఇప్పటికే షూటింగ్ ను మొదలు పెట్టి సగానికి పైగా పూర్తి చేశాడని సమాచారం అందుతోంది.

మరో రెండు మూడు నెలల్లో ఈ సినిమా పూర్తి అయ్యిందనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్నా ఆసక్తికర విషయాన్ని వెళ్లడించింది. తాజా ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా మాట్లాడుతూ.. విజయ్‌ తో తాను చేస్తున్న సినిమాలో పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది.

ఒక సెల్ఫిష్‌ అమ్మాయి మరియు తల పొగరు ఎక్కువ ఉండే అమ్మాయిగా తాను కనిపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. విజయ్‌ మరియు తనకు మద్య ఉండే సన్నివేశాల్లో తాను తల పొగరు ఎక్కువగా చూపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. తప్పకుండా ఒక మంచి పాత్రలో తనను ప్రతి ఒక్కరు చూస్తారని చెప్పుకొచ్చింది.

మరో వైపు ఈమె బాలీవుడ్‌ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న యానిమల్ లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రణబీర్ కపూర్‌ కు జోడీగా ఆ సినిమా లో రష్మిక నటిస్తోంది. ఆ సినిమా తో బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్స్ కు జోడీగా ఈ అమ్మడు నిలవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

మొత్తానికి ఒకే సారి పలు భారీ చిత్రాల్లో అది కూడా పాన్ ఇండియా స్టార్స్‌ నటిస్తున్న సినిమాలు అవ్వడంతో ఖచ్చితంగా ఈ అమ్మడు ముందు ముందు బాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల్లో కూడా టాప్ స్టార్ నటిగా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.