Begin typing your search above and press return to search.

సినిమాకు సైన్ చేయాలంటే ర‌ష్మిక ఆ రెండే చూస్తుంద‌ట‌!

By:  Tupaki Desk   |   5 Jun 2022 10:26 AM IST
సినిమాకు సైన్ చేయాలంటే ర‌ష్మిక ఆ రెండే చూస్తుంద‌ట‌!
X
శాండిల్ వుడ్ నుంచి వ‌చ్చి టాలీవుడ్ లో పాగా వేసిన హీరోయిన్ల‌లో ర‌ష్మిక మంద‌న్నా ఒక‌రు. `ఛలో` వంటి సూప‌ర్ హిట్ మూవీతో ఇక్క‌డ సినీ కెరీర్ ను ప్రారంభించిన ర‌ష్మిక‌.. అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. నేష‌న‌ల్ క్ర‌ష్ గా కూడా ముద్ర వేయించుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ, మ‌ల‌యాళ మ‌రియు హిందీ భాష‌ల్లోనూ న‌టిస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోందీ బ్యూటీ.

అలాగే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లోనూ అవ‌కాశాలు అందుకుంటున్న ర‌ష్మిక‌.. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన విష‌యాల‌ను సైతం షేర్ చేసుకుంది. ఏదైనా సినిమాకు సైన్ చేయాలంటే ప్ర‌ధానంగా వేటి గురించి ఆలోచిస్తానో కూడా వివ‌రించింది.

కొత్త ప్రాజెక్ట్ కు సంతకం చేయాలంటే కథ, త‌న పాత్ర ప్రాధాన్యం.. ఈ రెండిటినే మొద‌ట చూసుకుంటాన‌ని, ఒక్క‌సారి సైన్ చేశానంటే సినిమా పూర్తయ్యేవరకూ పాత్రకు న్యాయం చేసేందుకే ప్రయత్నిస్తాన‌ని ర‌ష్మిక పేర్కొంది. అలాగే సౌత్‌, నార్త్‌ అనే తేడా నాకెప్పుడూ లేద‌ని, దేశమంతా త‌నను గుర్తించాల‌ని, అభిమానులకు తాను మ‌రింత చేరువ‌వ్వాల‌ని.. అది పాన్‌ ఇండియా సినిమాలతోనే సుల‌భం అవుతుంద‌ని ర‌ష్మిక చెప్పుకొచ్చింది.

మొత్తానికి పాన్ ఇండియా చిత్రాల కోసం ఈ ముద్దుగుమ్మ తెగ ఆరాట‌ప‌డుతుంద‌ని స్ప‌ష్టంగా అర్థ‌మైంది. కాగా, ప్ర‌స్తుతం తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న `పుష్ప ది రూల్‌` అనే మూవీ చేస్తోంది. త‌మిళంలో విజ‌య్ ద‌ళ‌ప‌తి, వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న `ద‌ళ‌ప‌తి 66`లో హీరోయిన్ గా ఎంపిక అయింది. ఈ రెండూ పాన్ ఇండియా చిత్రాలే.

అలాగే మ‌ల‌యాళంలో దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న త్రిభాషా చిత్రం `సీతా రామం`లో ర‌ష్మిక కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. మ‌రోవైపు బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడీగా `మిషన్‌ మజ్ను`, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్ తో `గుడ్‌బై`, రణ‌బీర్‌ కపూర్ స‌ర‌స‌న `యానిమల్‌` చిత్రాల్లో సైతం న‌టిస్తోంది.