Begin typing your search above and press return to search.

శ్రీవల్లి హంగామా... ప్రతి చోట సూపర్‌ స్టార్స్ తోనే..!

By:  Tupaki Desk   |   24 April 2022 10:00 PM IST
శ్రీవల్లి హంగామా... ప్రతి చోట సూపర్‌ స్టార్స్ తోనే..!
X
ఛలో.. గీత గోవిందం సినిమాలతో తెలుగులో ఒక్క సారిగా స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. ప్రస్తుతం సౌత్‌ లోనే కాకుండా నార్త్‌ లో కూడా వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ ను దక్కించుకుంటూ ఉంది. పుష్ప సినిమా లో అల్లు అర్జున్‌ కు జోడీగా నటించడం ద్వారా శ్రీవల్లిగా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా సూపర్ హిట్‌ ను దక్కించుకుంది.

శ్రీవల్లిగా వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్‌ లో ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు లో సూపర్ స్టార్‌ మహేష్ బాబుతో సినిమాను చేసిన రష్మిక మరో వైపు పుష్ప 2 సినిమా లో నటిస్తుంది. తెలుగు లో ఇంకా రెండు మూడు పెద్ద సినిమాల్లో నటిస్తుంది. ఇక తమిళంలో సూపర్‌ స్టార్‌ విజయ్ తో కలిసి ఈ అమ్మడు నటిస్తుంది. ద్వి భాష చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఎంపిక అయ్యింది.

ఇటీవల జరిగిన విజయ్... వంశీ పైడిపల్లి కాంబో మూవీ పూజా కార్యక్రమంలో రష్మిక పాల్గొన్న విషయం తెల్సిందే. ఇక రష్మిక బాలీవుడ్‌ లో మెగాస్టార్‌ అమితాబచ్చన్ తో కలిసి నటించింది. అంతే కాకుండా బాలీవుడ్‌ లో పలువురు స్టార్‌ హీరోలతో కూడా కలిసి నటిస్తుంది. హీరోయిన్ గా ఈ అమ్మడు వరుసగా చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.

కనుక సందీప్‌ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్‌ హీరోగా రూపొందబోతున్న భారీ చిత్రం యానిమల్ లో అవకాశం దక్కించుకుంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. షూటింగ్‌ ప్రారంభం రోజే ఈమె కూడా హీరో రణబీర్ తో కలిసి షూటింగ్‌ లో పాల్గొన్నది అంటే సినిమాలో ఆమె పాత్రకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. రష్మిక మొత్తానికి అన్ని భాషల్లో కూడా స్టార్‌ హీరోలు.. సూపర్‌ స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

ఇండియాస్ బిగ్గెస్ట్‌ సినిమాల్లో నటిస్తున్నందుకు గాను ఈ శ్రీవల్లికి పారితోషికం కూడా భారీగా ఉంది. సౌత్‌ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ జాబిత తీస్తే అందులో రష్మిక పేరు ఉంటుంది. అంతటి పారితోషికం తీసుకుంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు సక్సెస్ అయితే బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్స్‌ రేంజ్‌ లో పారితోషికం తీసుకునే అవకాశాలు లేకపోలేదు అంటూ టాక్ వినిపిస్తుంది.