Begin typing your search above and press return to search.

అందుకే ఆ అనుబంధం బలంగా ఉంది: రకుల్

By:  Tupaki Desk   |   19 Jun 2022 7:00 PM IST
అందుకే ఆ అనుబంధం బలంగా ఉంది: రకుల్
X
మొన్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలతో సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మాత్రం తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీ పైన పెట్టింది. అక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అవకాశాలు సొంతం చేసుకుంటున్న ఈ బ్యూటీ మంచి పారితోషికం కూడా అందుకుంటోంది. డిజాస్టర్స్ ఎన్ని వచ్చినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు అయితే ఆమె అక్కడ నటించిన వారితోనే మరొకసారి కూడా నటించేందుకు అవకాశాలు అందుకుంటోంది.

ఇదివరకే అజయ్ దేవ్ గన్, సిద్ధార్థ మల్హోత్రా ఆమె రెండు సినిమాలు చేసింది. ఇప్పుడు మళ్లీ వారిద్దరే తో కలిసి మరో సినిమా కూడా చేస్తోంది. ఇక వారితో అనుబంధం గురించి కూడా ఆమె చాలా క్లారిటీగా తెలియజేసింది. ఇదివరకే రకుల్ ప్రీత్ సింగ్ దే దే ప్యార్ దే, రన్ వే 34 వంటి సినిమాలు చేసింది. అలాగే మరో వైపు సిద్దార్థ్ తో మార్జావన్, అయ్యరే సినిమాలు చేసింది.

అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఆ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ అయితే ఏమీ అందుకోలేదు. కానీ గ్లామరస్ బ్యూటీ గా మంచి క్రేజ్ అయితే అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె అజయ్ దేవ్ గన్ సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసి థాంక్ గార్డ్ అనే సినిమాలో నటిస్తోంది.

విభిన్నమైన డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ వారితో ఉన్న అనుబంధం గురించి తెలియజేసింది. అజయ్ తనకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన నటుడు అంటూ ఎలాంటి సలహా ఇచ్చినా కూడా చాలా పాజిటివ్గా తీసుకుంటారు అని చెప్పింది. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా అయితే తనకు మంచి స్నేహితుడు అంటూ మొదటి పరిచయం లోనే అతని తో మంచి స్నేహం ఏర్పడింది అని అనుబంధ కారణంగానే ఇద్దరితో కలిసి పాత్రలకు తగ్గట్టుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను అని రకుల్ తెలియజేసింది.